గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 08, 2020 , 00:20:50

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ& సీఎం కేసీఆర్‌ పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు అండగా నిలబడుతున్నారన్నారు. నియోజకవర్గంలోని 22 మంది లబ్ధిదారులకు 22 లక్షల 2వేల 552 రూపాయల చెక్కులు అందజేశామని తెలిపారు.అనంతరం ఐదుగురికి మంజూరైన 2లక్షల 3వేల500 రూపాయల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. 

14 నెలల్లో రూ. 22 కోట్లు పంపిణీ ..

తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 14 నెలల కాలంలో కామారెడ్డి నియోజకవర్గంలో 1717మంది లబ్ధిదారులకు రూ. 22 కోట్ల రూపాయల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశామని ప్రభుత్వ విప్‌ తెలిపారు. 14 నెలల కాలంలో నియోజకవర్గంలోని 292 మందికి 2 కోట్ల 22 లక్షల 3వేల 800 రూపాయలు లబ్ధిదారులకు అందజేశామని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎంకె ముజీబుద్దీన్‌, కామారెడ్డి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గోపిగౌడ్‌, మాచారెడ్డి జడ్పీటీసీ రాంరెడ్డి, ఎంపీపీ నర్సింగ్‌రావు, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, నాయకులు పున్న రాజేశ్వర్‌, మామిండ్ల అంజయ్య, అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సదాశివనగర్‌లో.. 

సదాశివనగర్‌ : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ వజ్జపల్లి తండాలో శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం జగదాంబ ఆలయా వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌ నాయక్‌, సర్పంచులు నీల, సురేందర్‌, లత, రమేశ్‌, బలరాం, లచ్చారం నాయక్‌, అనిల్‌ నాయక్‌, ఎంపీటీసీలు కాట్మండి రాంచందర్‌ రావు, సవిత, గోగూనూరి బాలయ్య, అరిగె రవికుమార్‌, వీరన్న, రాజు యాదవ్‌, పరమేశ్‌, నరేశ్‌ యాదవ్‌, రాజేశ్వర్‌రావు, కార్తిక్‌, రాజు కుమార్‌, శ్రీకాంత్‌ రావు, చంద్రాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>