శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 07, 2020 , 01:11:20

హెల్మెట్‌ ధరించే కుటుంబానికి గ్రామ సంఘాల రుణాలు

హెల్మెట్‌ ధరించే కుటుంబానికి గ్రామ సంఘాల రుణాలు

కామారెడ్డిరూరల్‌ : జిల్లా మహిళా సహకార సమాఖ్య సమీక్షా సమావేశం కామారెడ్డి మండల సమాఖ్య కారాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 మండల సమాఖ్యల నుంచి 22 మంది మండల అధ్యక్షులు, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్న సమావేశంలో డ్వామా పీడీ చంద్రమోహన్‌రెడ్డి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు రోడ్డు ప్రమాదాలు నివారించడంలో తమ వంతు పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రుణాలు తీసుకునే ప్రతి కుంటుంబంలో ఉన్న ద్విచక్ర వాహానికి తప్పకుండా హెల్మెట్‌ ఉండాలని, హెల్మెట్‌ లేని వారికి రుణాలు మంజూరు చేయమని తీర్మానించారు. ఈ విషయంలో ఆయా మండలాల ప్రతినిధులు వారి ప్రాంతాల్లోని గ్రామ సంఘాల ప్రతినిధులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆయా మండలాలకు చెందిన మండల సమాఖ్యల అధ్యక్షులు పాల్గొన్నారు.logo