శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 06, 2020 , 01:06:47

నేటి నుంచి ‘సహకార’ నామినేషన్ల స్వీకరణ

నేటి నుంచి ‘సహకార’ నామినేషన్ల స్వీకరణ
  • 8వ తేదీ వరకు అవకాశం
  • పార్టీల మద్దతు కోసం ఆశావహుల తంటాలు
  • ఏకగ్రీవాల వైపే మొగ్గు
  • గ్రామాల్లో మొదలైన సందడి వాతావరణం
  • మరుసటి రోజు నామినేషన్ల పరిశీలన
  • 10వ తేదీన ఉపసంహరణకు అవకాశం.. తుది జాబితా విడుదల

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన అనతి కాలంలోనే సర్కార్‌ సహకార ఎన్నికలకు శంఖారావం మోగించడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఈ నెల 3తేదీన ఎ న్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వార్డుల వా రీగా రిజర్వేషన్లు ఖారరు కావడంతో ఆశావహులు సభ్యులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. గు రు, శుక్ర, శనివారాల్లో నామినేషన్లను  స్వీకరించేందుకు ఆయా సొసైటీల్లో అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు. ఆదివారం  నామినేషన్ల పరిశీలన ఉం టుంది.10 తేదీన ఉపసంహరణల అనంతరం అదే రోజున అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉద యం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించి, మధ్యాహ్నం 2 గం టల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. 


సందడిగా మారిన గ్రామాలు

జిల్లాలో సహకార ఎన్నికల వేడి మొదలైంది. సర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో నిరాశకు గురైన వారు ఈ ఆవకాశం అందిపుచ్చుకునేందుకు  పావులు కదుపుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చోటా మోటా పంచాయతీ లు చేసే వారు, పట్టణాల్లో, తహసీల్‌ కార్యాలయాల్లో, మండల పరిషత్తులో పనులు చేస్తూ సేవలు అందిస్తున్న గ్రామస్థాయి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 


పార్టీల మద్దతు కోసం చక్కర్లు

వరుస విజయాలతో జోరు మీదున్న టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు కూడ గట్టుకోవడం కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వ్యవసా యంపై ఆధారపడి, రైతులకు అండగా నిలబడే సహకార సంఘాల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరు తున్నారు. సొసైటీ పరిధిలో ఉండే స్థానాలు తక్కువగా ఉండడంతో అన్ని గ్రామాల వారికి ఆవకాశం దక్కనుందని చెప్పవచ్చు. ఇప్పటికే పలు సొసైటీ పరిధిలో పార్టీలకతీతంగా అభివృద్ధే ధ్యేయంగా  రైతులు, నాయకులు ఏకగ్రీవాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో అధ్యక్ష పదవి ఒక గ్రామానికి అవకాశం ఇస్తే , ఉపాధ్యక్ష పదవిని పొందేందుకు అంగీకారాలు చేసుకునేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.


పోటీకి సై..

సొసైటీ ఎన్నికల్లో పోటీకి ఒకరిని మించి గ్రామాల్లో మరొకరు పోటీలో ఉండేందుకు సిద్ధంగా కాగా,  మరోవైపుఓటర్లు మాత్రం రైతులకు సహకారం అందించే వారికి మాత్రమే తమ ఓటు అని స్పష్టం చేస్తున్నారు. ఆశావహులు మాత్రం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో రుణాలు, సరిపడా ఎరువులు,  విత్తనాలు అందిస్తామని, ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీలు ఇస్తూ  ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా సొసైటీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. 


logo