ఆదివారం 29 మార్చి 2020
Kamareddy - Feb 06, 2020 , 01:05:03

అట్టడుగు వర్గాల సంక్షేమమే ప్రధాన ధ్యేయం

అట్టడుగు వర్గాల సంక్షేమమే ప్రధాన ధ్యేయం
  • ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పరిపూర్ణంగా అమలు చేస్తా..
  • ‘నమస్తే తెలంగాణ’తో కొత్త కలెక్టర్‌ ఎ.శరత్‌
  • ప్రజా ప్రతినిధులు,జిల్లా యంత్రాంగంతో సమన్వయం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  జిల్లా రెండో కలెక్టర్‌గా నియమితులైన డాక్టర్‌ ఎ.శర త్‌ బుధవారం విధుల్లో చేరారు. జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం జిల్లాకు బదిలీ చేసింది. ఇక్క డ సుదీర్ఘ కాలం పని చేసిన సత్యనారాయణను సీ డీఎంఏకు బదిలీ చేయగా ఆయన స్థానంలో వచ్చి న శరత్‌... బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి సొంత వాహనంలో జిల్లాకు వచ్చిన నూ తన కలెక్టర్‌కు సంయుక్త కలెక్టర్‌ యాదిరెడ్డి ఘనం గా స్వాగతం పలికారు. పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులంతా పుష్పగుచ్ఛాలతో  ఆహ్వానించారు. అనంతరం రామారెడ్డి మండల కేంద్రంలో ని కాలభైరవ స్వామి దేవాలయాన్ని కలెక్టర్‌ శరత్‌ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలతో పాటు గా ఆశీర్వచనాలు అందించారు. కాలభైరవుని దర్శ నం అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని జేసీ యాదిరెడ్డి నుంచి బాధ్యతలను స్వీకరించారు.  ఎస్పీ శ్వే తారెడ్డి, జిల్లా అధికారులతో తొలిరోజే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయా శాఖల పనితీరుపై కలెక్టర్‌ శరత్‌ సంపూర్ణ అవగాహనను పొందారు. ‘నమస్తే తెలంగాణ’తో కలెక్టర్‌ శరత్‌  ముచ్చటించిన మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...


కామారెడ్డికి రావడం సంతోషంగా ఉంది...

జగిత్యాల జిల్లాకు తొలి కలెక్టర్‌గా పని చేశాను. మూడు సంవత్సరాల నాలుగు నెలల పాటుగా విజయవంతంగా విధులు నిర్వర్తించి కామారెడ్డి జిల్లా కు కలెక్టర్‌గా రావడం సంతోషంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతో పూర్వ అనుబంధం ఏమీ  లేకపోయినప్పటికీ జిల్లాపై త్వరలోనే సంపూ ర్ణ అవగాహనను పెంపొందించుకుంటాను. జగిత్యాల జిల్లాలో నేను చేసిన పనికి ఈ జిల్లాకు సం బంధం ఉండబోదు. ఒక్కో జిల్లాకు అక్కడి భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల ప్రకారం తేడాలుంటాయి. 


కామారెడ్డి జిల్లాలో నాకున్న ప్రాధామ్యాలు ఏమిటన్నదీ త్వరలోనే తెలుస్తుంది. జగిత్యాల జిల్లాను పదో తరగతి ఫలితాల్లో వరుసగా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలబెట్టాం. ఇక్కడ ఆ పరిస్థితులపై అంచ నా వేయాల్సిన అవసరం ఉంది. పేద వర్గాలకు అ న్యాయం జరుగకుండా, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకు వెళ్లడమే నాకున్న ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకు వస్తా.


సమన్వయంతో ముందడుగు...

జిల్లా పురోగభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సహకారం ఎంతో అవసరం. వీరందరితో అత్యున్నతమైన సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాను. సమన్వయం చేసుకుంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నిస్తాను. నాకంటూ వ్యక్తిగతంగా ఎలాంటి ప్రాధామ్యాలు లేవు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాలే నాకున్న ప్రాధామ్యాలు. వాటిని తూచా తప్పకుండా పారదర్శకంగా అర్హులైన వా రందరికీ చేర్చడమే నా విధి. గతంలో పని చేసిన  కలెక్టర్‌ సత్యనారాయణ సైతం తనదైన ప్రత్యేకతను చాటారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తాను. కొత్త కార్యక్రమాలను చేపడతాను. మూడేండ్లుగా జిల్లాలోనూ మంచి పాలన అం దింది. ఇకపైనా అదే రకమైన సంతృప్తి ప్రజలకు అందుతుంది. వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టి కొనసాగుతుంది. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేసేందుకు నడుం కడతాం.


కిక్కిరిసిన కలెక్టరేట్‌...

కలెక్టర్‌గా విధులు చేపట్టిన ఎ.శరత్‌ను అభినందించేందుకు జిల్లా అధికారులు కలెక్టరేట్‌లో వరుస కట్టారు. ఆయా శాఖల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపేందుకు తరలి రావడంతో కలెక్టరేట్‌ ప్రాంగణం కిక్కిరిసింది. టీఎన్జీవో నేతలు, పలు ఉద్యోగ సం ఘాల నాయకులంతా జిల్లా కలెక్టర్‌ను పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. జిల్లా పురోగాభివృద్ధిలో ఉద్యోగులంతా కలిసి కట్టుగా పని చేసేందుకు సిద్ధం గా ఉన్నట్లు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దయానంద్‌ తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందుబాటులో ఉన్న జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదటగా ఆయా శాఖల అధికారులను పరిచయం చేసుకున్న తర్వాత గణాంకాలను, ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా భౌగోళిక పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చిన  కలెక్టర్‌ త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం జిల్లా అధికారులను సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లుగా సమాచారం.


logo