సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 06, 2020 , 01:02:03

జిల్లాలోనే మొదటి సారిగా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు

 జిల్లాలోనే మొదటి సారిగా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. పార్ట్‌-బీలోని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొట్ట మొ దటిగా సారిగా చిన్న రాంపూర్‌ గ్రామ శివారులో సుమారు 107 ఎకరాల 35 గుంటల పార్ట్‌-బీలో ఉన్న భూములకు పరిష్కారం లభించడంతో 84 మంది రైతులకు పట్టా కాగితాలు అందాయి. రెవెన్యూ, అటవీ శాఖ సర్వేలతో కష్టాలు తీరాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా సమస్యలతో కూడిన భూములపై రైతులకు పట్టాలు అందించేలా కృషి చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్‌, నాయకులకు గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.


logo