బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 06, 2020 , 00:57:14

కలెక్టర్‌ శరత్‌ బాధ్యతల స్వీకరణ

కలెక్టర్‌ శరత్‌ బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన శరత్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మొదటగా హైదరాబాద్‌ నుంచి వచ్చిన కలెక్టర్‌ శరత్‌ టేక్రియాల్‌ గ్రామ శివారులో గల హోటల్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ శరత్‌కు జేసీ యాదిరెడ్డి, అధికారులు స్వాగతం పలికారు.  అక్కడే అల్పాహారం చేసి  నేరుగా రామారెడ్డి ఇస్సన్నపల్లి గ్రామం లో గల శ్రీ కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్లారు. కలెక్టర్‌ శరత్‌కు ఆలయ వేదపండితులు, ఆలయ క మిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో మం గళవాయిద్యాల మధ్య స్వాగతం పలికారు. ఆలయంలో కలెక్టర్‌ శరత్‌ ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్‌ శరత్‌కు స్వామి వారి చిత్రపటంతో పాటు, శాలువతో తీర్థ ప్రసాదాలు అందచేసి ఘనంగా సన్మానించా రు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ  చైర్మన్‌ సతీ శ్‌గుప్తా, రామారెడ్డి ఎంపీపీ దశరథరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


అక్కడి నుంచి బయల్దేరిన కలెక్టర్‌ నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుని 11.52 నిమిషాలకు కలెక్టర్‌ ఛాంబర్‌లో తొలి సంతకం చేసి బా ధ్యతలు స్వీకరించారు. జేసీ  యాదిరెడ్డి జిల్లా అధికారులు, ఆర్డీవోలు ఇతర అధికారులను పరిచ యం చేశారు. అనంతరం పలువురు కలెక్టర్‌ శరత్‌ కు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికా రు. కలెక్టర్‌ చాంబర్‌లో ఎస్పీ శ్వేతా రెడ్డితో పాటు జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే జిల్లా అధికారులు   పాల్గొన్నారు. logo
>>>>>>