మంగళవారం 07 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 05, 2020 , 01:15:31

ప్రగతిపథంలో ఏదులాపురం సొసైటీ

ప్రగతిపథంలో ఏదులాపురం సొసైటీ

ఖమ్మం రూరల్‌, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 4: ఖమ్మం రూరల్‌ మండలంలో గల ఏదులాపురం సహకార పరపతి సంఘం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. 2013లో కొలువుదీరిన పాలకవర్గం ఏడేళ్ల పాటు లక్ష్యసాధన దిశగా పయనించి రైతులకు సేవలందించింది. 2013లో రూ.7.5 కోట్లతో ప్రారంభమైన బ్యాంక్‌ టర్నోవర్‌ నేడు రూ.15 కోట్లను దాటింది. రైతుల నుంచి షేర్‌ క్యాపిటల్‌ రూ.1.40 కోట్లు, డిపాజిట్లు రూ.1.20 కోట్లు ఉన్నాయి. సంఘ పరిధిలో వెతయ్యి మంది రైతులకు రూ.4 కోట్ల రుణాలు ఇచ్చారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రూ.8.16 కోట్లను రైతులకు వర్తింపజేశారు. సంఘ పరిధిలోని రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.13 కోట్లు వ్యాపారం చేశారు. సబ్సిడీ విత్తనాలపై రూ.3 కోట్లు వ్యాపారం చేసి రికార్డు సృష్టించారు. సంఘ పరిధిలోని 16 పంచాయతీలతో పాటు 5 విలీన పంచాయతీల్లో 6765 మంది రైతులు ఓట్లు కలిగి ఉన్నారు. 13 వార్డులు ఉన్నాయి. గెదెలు, బైకులకు రూ.5 కోట్ల మేర రుణాలు ఇచ్చారు. రైతులకు ఏడేళ్లుగా సేవ చేసిన ఇదే పాలకవర్గాన్ని మరోసారి ఎన్నుకోవాలని రైతులు ఆసక్తిగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సొసైటీలకు మహర్దశ పట్టడంతో రైతులకు కూడా లబ్ధి జరిగింది.


రైతుల సంక్షేమమే లక్ష్యం..

“నేనుబాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు రైతుల సంక్షేమం కోసమే పనిచేశా. పాలకవర్గ సభ్యుల సహకారంతో ఏడేళ్లపాటు సంఘాన్ని విజయపథంలో నడింపించా. రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించడంలో కీలకపాత్ర పోషించా. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఒక్కటే ఉంఏడది. అప్పటి డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు సహకారంతో మరో కొనుగోలు కేంద్రాన్ని తీసుకవచ్చి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం.”

-మంకెన నాగేశ్వరరావు, ఏదులాపురం పీఎసీఎస్‌ చైర్మన్‌


logo