ఆదివాసీగా పుట్టినా ఆధునికతను అందిపుచ్చుకొని ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఒడిశాకు చెందిన రియా రేశమ్ బరీ. ‘హో’ అనే ఆదివాసీ తెగలో జన్మించింది రియా. చదువుల మీద ప్రేమతో క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో చేరింది. రియాకు చిన్నప్పటినుంచీ మోడలింగ్‌పై ఆసక్తి. అదే ఆమెను ఫ్యాషన్ ప్రపంచంవైపు ఆకర్షించింది. చదువును మధ్యలోనే ఆపేసి, గ్లామర్ రాజధాని ముంబయి చేరుకుంది. అందాల పోటీల్లో పాల్గొంటూ మోడలింగ్‌లో రాణించింది. 2016లో వరల్డ్ సూపర్ మోడల్ ఇండియా పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచింది. అంతేకాదు ‘అన్లిమిటెడ్’ మెగా మోడల్ హంట్ టైటిల్‌నూ గెలుచుకుంది. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ నుంచి పట్టా కూడా పొందింది. ఇండియాస్ నెక్స్ టాప్ మోడల్స్ పాపులర్ రియాలిటీ షోలోనూ సత్తా చాటింది. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచిన తొలి ట్రైబల్ మోడల్ కూడా రియానే.