బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 04, 2020 , 00:29:23

పీఏసీఎస్‌ చైర్మన్‌ పీఠంపై గురి...!

పీఏసీఎస్‌ చైర్మన్‌ పీఠంపై గురి...!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. జిల్లాలో 55 సంఘాలున్నాయి. సంఘాల స్థాయిలోనే ఎన్నికల అధికారులు సంబంధిత సంఘాల్లో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితాతో పాటు ఎన్నికల నోటీసును ప్రదర్శించారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు ము మ్మరం చేశారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అ ధికారులను నియమించారు. దీంతో వారు తమ కు కేటాయించిన సంఘాల కార్యాలయాలకు చేరుకున్నారు. జిల్లాలో 55 పీఏసీఎస్‌ ఎన్నికలకు గాను రూట్‌ ఆఫీసర్లను, జోనల్‌ ఆఫీసర్లను, మానిటరింగ్‌ ఆఫీసర్లను నియమించారు. ఓటరు జాబితా కావాలనుకునే వారు నిర్ణీత రుసుము చెల్లించి పీఏసీఎస్‌ ల నుంచి తీసుకోవచ్చు. పోలింగ్‌ సిబ్బంది నియామక ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది. ఒక్కో సంఘానికి సుమారుగా 40 మంది సిబ్బంది అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఎన్నికల అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. సహకార సంఘాల ఎన్నికల్లో కీలకమైన ఎన్నికల నోటిఫికేష న్‌ విడుదల కావడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.

వార్డుల విభజన ఇలా...

ఓటరు జాబితాల వెల్లడి అనంతరం వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలో 55 సహకార సం ఘాల్లో ప్రతీ సంఘానికి 13 వార్డుల చొప్పున 715 వార్డులున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని ఓటర్లను రెవెన్యూ గ్రామాల వా రీగా విభజిస్తారు. మొదటగా సొసైటీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి మొదటి వార్డు నుంచి నెంబర్‌ను కేటాయిస్తూ పోతారు. తదుపరి ఓటర్ల సంఖ్యను అనుసరించి సంఘానికి ఈశాన్య దిక్కున గల గ్రా మాన్ని లెక్కించి గడియారంలోని ముల్లు తిరిగిన మాదిరిగా మిగిలిన గ్రామాల్లోని ఓటర్లను ఆయా వార్డుల్లో చేర్చుతారు. 13 వార్డుల్లో ఓటర్ల వర్గాల ను బట్టి 7 జనరల్‌ కోటాలో, 1 జనరల్‌ మహిళ, 2 బీసీ జనరల్‌, 1 ఎస్టీ, 1 ఎస్సీ జనరల్‌, 1 ఎస్సీ మహిళకు కేటాయిస్తారు. సరిపడా ఓటర్లు లేకుంటే వార్డులను కుదిస్తారు. ఉదాహరణకు ఎస్టీ ఓటరు లేకుంటే 12 వార్డులుగానే విభజించి ఓటర్లందరినీ 12 వార్డుల్లోనే సర్దుబాటు చేసి ఎన్నికలు జరుపుతారు. ఇరుపక్షాల్లోనూ గెలిచిన వారు సమానంగా ఉన్నప్పుడు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎంపిక సమయంలో కోరం లేదా టాస్‌ వేసే పద్ధతిని అనుసరిస్తారని అధికారులు తెలిపారు.

అందరి టార్గెట్‌ చైర్మన్‌ పీఠమే...

పీఏసీఎస్‌ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఔత్సాహికులందరి దృష్టి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలపైనే పడింది. చైర్మన్‌ పీఠంపై కన్నేసిన వారంతా స్థానిక ఎమ్మెల్యేల ఆశీస్సుల కో సం చక్కర్లు కొడుతున్నా రు. వారు పార్టీకి చేసిన సే వను దృష్టిలో పెట్టుకొని పదవులను కట్టబెట్టాలని వేడుకుంటున్నా రు. మరికొందరైతే సానుభూతి అ స్ర్తాన్ని సంధిస్తున్నారు. పం చాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన నాయకులు సైతం మరోమారు అవకాశం ఇవ్వాలంటూ నే తలను కోరుకుంటున్నారు. పీఏసీఎస్‌ చై ర్మన్‌ పీఠాలను అధిరోహిస్తే రైతులకు సేవ చేసే అవకాశం దొరకడం, సమాజంలో మంచి గుర్తింపు కలిసి వస్తుందనే ఆశతో చాలా మంది పోటీకి ఇష్టపడుతున్నారు.

6, 7, 8 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ...

సహకార సంఘాల ఎన్నికలకై విడుదలైన నోటిఫికేష న్‌ ప్రకారం ఈనెల 6, 7, 8 తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. 9న పరిశీల న, 10న ఉప సంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రదర్శన ఉంటుంది. అభ్యర్థులకు సహకార ఎన్నికల అథారిటీ గుర్తించిన 24 గు ర్తులు అందుబాటులో ఉం టాయి. ఇవి కాకుంటే అదనంగా మరో 55 గుర్తులను ఎంపిక చేసి ఉంచారు. ఈ నెల 15న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పో లింగ్‌ జరిపి పోలింగ్‌ ప్రక్రి య ముగిసిన తర్వాత లెక్కింపు జరిపి ఫలితాలను అదే రోజు వెల్లడిస్తారు. తదుపరి 3 రోజుల్లోపు పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు పరోక్ష పద్ధతిన ఎన్నిక జరుపుతా రు. జిల్లాలో 55 సహకార సంఘాలుండగా ప్రతి సంఘానికి ఒక ఎన్నికల అధికారిని, ఒక సహాయ ఎన్నికల అధికారులను, సిబ్బందిని నియమించగా వీరికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికారులు ఆయా సంఘాల పరిధి కేంద్రంలోనే నామినేషన్లు స్వీకరిస్తారు. సంఘం పరిధిలోని ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాలలోనే ఎన్నిక జరుపుతారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ వార్డుల సంఖ్యను బట్టి బూత్‌లను ఏర్పాటు చేస్తారు.

55 సహకార సంఘాల్లో..

జిల్లాలోని 55 సహకార సంఘాల్లో మొత్తం 1,39,589 సభ్యులు ఉండగా, 91,288 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇందులో 63,201 మహిళలు, 28,087 పురుషులు ఉన్నారు. 55 సంఘాల్లోని 713 వార్డుల్లో (ప్రాదేశిక నియోజకవర్గాలు) 55 మంది ఎస్సీ మహిళలకు, 56 మంది ఎస్సీ జనరల్‌, 52 ఎస్టీ జనరల్‌, 110 బీసీ జనరల్‌, 53 ఓసీ మహిళలు, 387 స్థానాలకు జనరల్‌కు కేటాయించారు.


logo
>>>>>>