ఆదివారం 24 మే 2020
Kamareddy - Feb 04, 2020 , 00:26:46

కలెక్టర్‌ సత్యనారాయణ రిలీవ్‌

కలెక్టర్‌ సత్యనారాయణ రిలీవ్‌

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి జిల్లాలో సుదీర్ఘ కాలం కలెక్టర్‌గా సేవలు అందించిన సత్యనారాయణ సోమవారం సాయంత్రం విధుల నుంచి రిలీవ్‌ అయ్యారు. ఆదివారం రాత్రి ప్రభుత్వం బదిలీ చేయడంతో నూతన బాధ్యతలు స్వీకరించడానికి హైదరాబాద్‌ వెళ్లినట్లు సమాచారం. సాధారణ పరిపాలన శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు  కలెక్టర్‌  విధుల నుంచి రిలీవ్‌ అయ్యారు. మంగళ, బుధ వారాల్లో  కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ (సీడీఎంఏ) గా బాధ్యతలు స్వీకరిస్తారు. కామారెడ్డి కొత్త కలెక్టర్‌ శరత్‌ నేడు లేదా రేపు విధుల్లో చేరే అవకాశం ఉంది. కొత్త కలెక్టర్‌ విధుల్లో చేరకపోతే జేసీ యాదిరెడ్డి ఇన్‌చార్జి కలెక్టర్‌గా తాత్కాలిక విధులు నిర్వహిస్తారు. logo