శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 04, 2020 , 00:24:54

‘అత్యవసర సమయాల్లో డయర్‌ 100కు కాల్‌ చేయాలి’

‘అత్యవసర సమయాల్లో డయర్‌ 100కు కాల్‌ చేయాలి’

లింగంపేట: అత్యవసర సమయాల్లో డయల్‌ 100 నంబరుకు కాల్‌ చేయాలని ఏఎస్సై రాజేశ్వర్‌ సూచించారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్సులో సోమవారం ప్రయాణికులకు అవగాహన కల్పించారు. 100 నంబర్‌కు కాల్‌ చేయడంతో సమీపంలోని పోలీసు స్టేషన్‌ సిబ్బంది స్పందించి సంఘటన స్థలానికి చేరుకుంటారని వెల్లడించారు. బంధువులకు ఫోన్‌ చేయడంతో సమస్యకు పరిష్కారం లభించదన్నారు. బందువుల అందుబాటులో ఉండక పోయినా అన్ని సమయాల్లో పోలీసులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఆయన వెంట పోలీసులు ప్రభాకర్‌, స్వామిగౌడ్‌ తదితరులు ఉన్నారు.

నోహెల్మెట్‌, నో పెట్రోల్‌

హెల్మెట్‌ లేకుండా పెట్రోల్‌ కోసం వచ్చిన వారికి పెట్రోల్‌ పోయవద్దని ఏఎస్సై రాజేశ్వర్‌ సూచించారు. మండల కేంద్రంలోని పెట్రోల్‌ పంపులో పోస్టర్‌ అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణాలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవిస్తే తలకు గాయాలై ప్రాణాలు కోల్పోవలసి వస్తున్నదన్నారు. హెల్మెట్‌ లేకుండా పెట్రోలు కోసం వస్తే వారికి పెట్రోల్‌ పోయవద్దని సూచించారు.

హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి

నిజాంసాగర్‌,నమస్తే తెలంగాణ: వాహనాదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఎస్సై సాయన్న అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం నుంచి హెల్మెట్లు ధరించిన వారికే పెట్రోల్‌ పోయాలని సూచించారు. పోలీస్‌ శాఖ పనితీరుపై అవగాహన కల్పించారు. 

206 మందికి జరిమానా 

కామారెడ్డి, నమస్తే తెలంగాణ:

జిల్లా వ్యాప్తంగా సోమవారం హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు పోలీసులు జరిమానాలు విధించారు. జిల్లా వ్యాప్తంగా 206 మందికి జరిమానాలు విధించినట్టు ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. కామారెడ్డి డివిజన్‌లో 106 మంది, ఎల్లారెడ్డి సబ్‌డివిజన్‌లో 33 మంది, బాన్సువాడ సబ్‌ డివిజన్‌లో 67 మందికి జరిమానాలు విధించినట్టు వెల్లడించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు వాడాలని సూచించారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

నిజాంసాగర్‌ రూరల్‌: ద్విచక్రవాహనదారులతో పాటు వాహన చోదకులు, ప్రయాణికులు ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని  ఎస్సై సాయన్న సూచించారు. సోమవారం నిజాంసాగర్‌ మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామంలో స్థానికులు, డ్రైవర్లతో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలను నడుపవద్దని, అన్ని రకాల ధ్రువ పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు దఫేదార్‌ విజయ్‌, కాశయ్య, మహేందర్‌, జక్సాని భాను, అప్జల్‌, రాములు ఉన్నారు.  


logo