సోమవారం 30 మార్చి 2020
Kamareddy - Feb 04, 2020 , 00:21:34

పల్లెప్రగతి పనులను వంద శాతం పూర్తిచేయాలి

పల్లెప్రగతి పనులను వంద శాతం పూర్తిచేయాలి

విద్యానగర్‌ (రామారెడ్డి) : పల్లెప్రగతి పనులను వంద శాతం పూర్తి చేయాలని మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్‌ సువర్ణ అన్నారు. రెండో విడత పల్లెప్రగతిలో భాగం గా రామారెడ్డి మండలంలోని కన్నాపూర్‌, కన్నాపూర్‌ తండాలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనుల రికార్డులను, శ్మశాన వాటిక, డంపింగ్‌యా ర్డు, నర్సరీలను ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరితహారం కోసం నర్సరీల్లో మొక్కలను త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. రోడ్లపైన చెత్తను వేయరాదని, ప్లాస్టిక్‌ను డంపింగ్‌ యార్డ్‌లో వేయాలన్నారు. ప్లాస్టిక్‌ను కాల్చితే శ్వాసకోశ వ్యాధులు వస్తాయన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని వాడాలన్నారు. 

అనంతరం గోకుల్‌ తండాలోని పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మత్య్సశాఖ జిల్లా అధికారిణి పూర్ణిమ, కన్నాపూర్‌ సర్పంచ్‌ రాజనర్సు, కన్నాపూర్‌ తండా సర్పంచ్‌ చందర్‌నాయక్‌, ఉపసర్పంచ్‌ సర్మన్‌ నాయక్‌, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, డీఎల్పీవో హరిసింగ్‌, ఏపీవో ధర్మారెడ్డి, ఎంపీవో సవిత, ఏపీఎం మోహిద్‌ తదితరులు పాల్గొన్నారు.


logo