గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 02, 2020 , 02:20:55

పాలన మరింత చేరువ..

పాలన మరింత చేరువ..

ఇందూరు : రథసప్తమిని పురస్కరించుకొని నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వరుడి రథోత్సవం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు అశేష భక్తజనం తరలిరావడంతో కంఠేశ్వర్ ప్రాంతం భక్తజన సంద్రమైంది. ఆలయ ఆవరణ శివనామస్మరణతో మార్మోగింది. రథసప్తమి సందర్భంగా శనివారం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వారం నుంచి పల్లకీలో వెలుపలికి తీసుకువచ్చారు. అలంకరించిన రథంపై గంగాదేవి, పార్వతీ సమేతంగా నీలకంఠుని ఉత్సవ విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి తల్లిఘోరీ వరకు రథయాత్ర సాగింది. ఊరేగింపులో రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఘోరీ వద్ద ప్రత్యేక పూజలు అనంతరం రథం తిరిగి ఆలయానికి చేరుకుంది. జాతర సందర్భంగా ఆలయ ఆవరణలో దుకాణాలు వెలిశాయి. రథయాత్ర సందర్భంగా ఆర్మూర్ వైపునకు వెళ్లే వాహనాలను దారి మళ్ల్లించారు. రథోత్సవంలో నగర మేయర్ నీతుకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య, ఈవో మహేందర్‌గౌడ్, దండు శేఖర్, కార్పొరేటర్లు, నాయకులు, రథోత్సవ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


logo