బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 02, 2020 , 02:13:25

సొసైటీ ఎన్నికల్లో అన్నిస్థానాలు గెలుచుకోవాలి

సొసైటీ ఎన్నికల్లో అన్నిస్థానాలు గెలుచుకోవాలి

బీబీపేట్ : త్వరలో నిర్వహించనున్న సొసైటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అన్ని స్థానాలు గెలుచుకునేలా పార్టీ కార్యకర్తలు కృషిచేయాలని జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సొసైటీ ఎన్నికల్లో 13 డైరెక్టర్ స్థానాలకు పోటీ జరగనుందని, అన్ని స్థానాలు గెలుపొంది సొసైటీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేలా పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించాలని, అర్హులకు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలామణి, వైస్ ఎంపీపీ రవీందర్‌రెడ్డి, బాశెట్టి నాగేశ్వర్, తేలు సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్ ఎంబరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo
>>>>>>