బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 01, 2020 , 01:37:12

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • జిల్లా వ్యాప్తంగా46 కేంద్రాలు
  • హాజరుకానున్న 7587 మంది విద్యార్థులు

విద్యానగర్‌ :  ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు మాద్యమిక విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.ఇందుకోసం జిల్లా వ్యా ప్తంగా 46 పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఇంటర్‌ పరీక్షల్లో ప్రాక్టికల్‌ మార్కులు ఎంతో కీలకంగా మారడం తో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు  చేశారు. పరీక్షల నిర్వాహణ కోసం అనుభవం కలిగిన ఇన్విజిలేటర్లను నియమించి ప రీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఫ్లయిం గ్‌ స్కాడ్‌లతో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీలు ఎప్పటికప్పుడు పరీక్షలను పరిశీలించనున్నా యి. ఇంటర్‌ షెడ్యూల్‌ ప్రకారం మార్చి 4 నుంచి 20 వరకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాక్టికల్‌ పరీక్షలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.     

     

జిల్లాలో 46 ప్రాక్టికల్‌ పరీక్షా కేంద్రాలు సిద్ధం

జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఒక ఎయిడెడ్‌ కళాశాల, ఒక రెసిడెన్షియల్‌ కళాశాల, ఒక మైనార్టీ రెసిడెన్షియల్‌ కళాశాల,  9 సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలు, 4 ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాలలు, 6 మాడ ల్‌ స్కూళ్లు, 9 కేజీబీవీలు, 3 ఒకేషనల్‌ కళాశాలలు మొత్తం 46 సెంటర్లలో ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరుగుతాయి. జనరల్‌ 39, ఒకేషనల్‌ 7 సెంటర్లలో,  కా మారెడ్డి పట్టణంలో 5 సెంటర్లు ఉన్నాయి. ఈ ప్రాక్టికల్స్‌కు జనరల్‌ విద్యార్థులు 6,600 మంది, ఒకేషనల్‌  విద్యార్థులు 987 మంది హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వ రకు, 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో ఈ ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. ఈ ప్రాక్టికల్‌ పరీక్షకు అరగంట ముందు ఓటీపీ ద్వారా ప్రశ్నాపత్రం ఆన్‌లైన్‌లో అందుతుంది. ప్రాక్టికల్‌ పరీక్షలో అరగంట ముందుగానే విద్యార్ధులను ల్యాబ్‌లోకి పంపిస్తారు. ప్రాక్టికల్‌ ల్యాబ్స్‌ ఫొటోలను వాట్సప్‌లో పంపాలని ఇప్పటికే ప్రిన్సిపాల్స్‌కు సూచించారు


logo