శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 01, 2020 , 01:24:57

3న తుది ఓటరు జాబితా

3న తుది ఓటరు జాబితా

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: సహకార సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధమవుతు న్నది.  జిల్లా సహకార శాఖ రంగంలోకి దిగింది. ప్రధాన ఘట్టమైన ఓటరు జాబితాపై దృష్టి సారించింది. ఈ నెల 3న ప్రతీ సొసైటీకి నోటిఫికేషన్‌ వి డుదల చేస్తారు. దీని కోసం ప్రతీ పీఏసీఎస్‌కు ఒక ఎన్నికల అధికారిని నియమించారు. వీరు 3న సంఘాల వారీగా నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో పాటు తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. అప్పటి వరకు కొత్తగా సభ్యులుగా చేరిన వారిలో ఓటరుగా అర్హత పొందిన వారిని తుది ఓటరు జాబితాలో పొందుపరుస్తారు. 2018 జనవరి ఒకటో తారీఖు వరకు సహకార సంఘాల వా రీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. ఆ లెక్క ప్ర కారం నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 1.16 లక్ష ల మంది ఓటర్లున్నారు. 2018 జనవరి నుంచి అదే ఏడాది డిసెంబర్‌ నెలాఖరు వరకు సభ్యులుగా ఉన్నవారిని ఓటరుగా పరిగణిస్తారు. వీరు పేర్లను జాబితాలో చేరుస్తారు. వీరు కచ్చితంగా రూ. 300 షేర్‌ క్యాపిటల్‌ చెల్లించి ఉండాలి. సం ఘాల ద్వారా తీసుకున్న రుణాలన్నీ వాయిదా లే కుండా చెల్లించి ఉండాలి. ఓవర్‌ డ్యూస్‌ ఉండరా దు. నిధుల దుర్వినియోగం చేసినట్లు తేలితే ఓటరుగా అనర్హులుగా తేలుస్తారు. ఈ ప్రతిపాదికన ఓటరుగా గుర్తించి తుది జాబితాను రూపొందిస్తున్నారు. 


ఈ మేరకు శుక్రవారం టీఎన్‌జీవో భవన్‌లో జిల్లా సహకార శాఖ పీఏసీఎస్‌ల సీఈవోలతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఓటరు తుది జాబితా రూపకల్పనపై కార్యాచరణ గురించి చర్చించుకున్నారు. జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. 3న సొసైటీల వారీగా నోటిఫికేషన్‌ ఇవ్వడంతో పాటు తుదిజాబితాను సొసైటీల్లో ప్రదర్శిస్తారు. నిజామాబాద్‌ జిల్లాలో 89 సొసైటీలు ఉం డగా.. కామారెడ్డి జిల్లాలో 55 ఉన్నాయి. మొత్తం 144 సొసైటీలకు ఎన్నికలు జరుగుతాయి. 6, 7,8 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 9న స్క్రూటినీ, 10న ఉపసంహరణ ఉంటుంది. 15న ఎన్నికలుంటాయి. 16న సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉంటుంది. ప్రతీ సొసైటీలో 13 సె గ్మెంట్లుగా విభజిస్తారు. ఎస్సీ ఒకటి, ఎస్సీ (మహిళ) ఒకటి, ఎస్టీ (1) బీసీ రెండు, ఓసీ (మహిళ) ఒకటి, ఓసీ (జనరల్‌) 7.. మొత్తం 13 మందికి రిజర్వేషన్లు కల్పిస్తారు. 13 మంది ఈ రిజర్వేషన్‌ ప్రాతిపదికన డైరెక్టర్లుగా ఎన్నుకోబడతారు. వీరం తా ఆ సొసైటీకి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ మేరకు 3న రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. జిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌ను ఎన్నుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మ రో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ ఎ న్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన 144 మంది సొసైటీ చైర్మన్లు పాల్గొని ఓటేస్తారు. చైర్మన్‌ , వైస్‌ చైర్మన్‌తో పాటు కో ఆపరేటివ్‌ బ్యాంకు డైరెక్టర్లుగా 23 మందిని ఎన్నుకుంటారు. 


logo