శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 01, 2020 , 01:24:25

కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం..

కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం..

మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   పంటలకు మద్దతు ధరను అందజేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌నాయక్‌, ఎంపీపీ రాధా బలరాం, తహసీల్దార్‌ సంగమేశ్వర్‌, ఎంపీడీవో రవీశ్వర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సత్యం పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ పెద్దబూరి సత్యం, గాంధారి, ముదెల్లి విండో చైర్మన్లు ముకుంద్‌రావు, శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ భజన్‌లాల్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ శంకర్‌, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు శివాజీరావు, సంతోష్‌, శ్రీనునాయక్‌, బెజుగం సంతోష్‌, రొడ్డోల్లా గంగాధర్‌, సంగని బాలయ్య, గడ శంకర్‌, రమేశ్‌, రెడ్డి రాజు, కమ్మరి సాయిలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


logo