గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 31, 2020 , 03:47:13

‘సహకార’ సమరం...!

‘సహకార’ సమరం...!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని 54 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఒకటి ఫార్మర్స్‌ సర్వీస్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలకు 2013 జనవరిలో ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గాల పదవీ కాలం 2018, ఫిబ్రవ రి 2వ తేదీన ముగిసింది. దీంతో ప్రభుత్వం సహకార సంఘాలకు అప్పుడే ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. మొదటిసారిగా ప్రభుత్వం 2018, ఫిబ్రవరిలో సహకార సంఘాల ఎన్నికలను వా యిదా వేసింది. పాలకవర్గాల పదవీ కాలాన్ని కూ డా ఆరు నెలల పాటు పొడిగించింది. మొదటిసారిగా జూలైలో గడువు ముగిసింది. ఆ తర్వాత మ రో ఆరు నెలలు ఇలా ఇప్పటి వరకు నాలుగు సా ర్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువును పొడిగించారు. ఐదోసారి పొడిగించేందుకు అవకాశం లేనందున ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. దీంతో సహకార శాఖల అధికారులు ఎన్నికలకు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం అవుతున్నారు. ఫిబ్రవరి 2తో పొడిగించిన పదవీ కాలం ముగియనుండడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది.


ప్రభుత్వం ఎన్నికల కు సిద్ధం కావడంతో జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసిన 8 పీఏసీఎస్‌ల ఏర్పాటు అటకెక్కనున్నాయి. మండలానికి రెండు చొప్పున పీఏసీఎస్‌లు ఉండాలని ప్రభుత్వం భావించినప్పటికీ ప్రస్తుతం వాటి ఏర్పాటు లేనట్లేనని అధికారు లు చెబుతున్నారు. సహకార ఎన్నికలకు రాష్ట్ర కో-ఆపరేటివ్‌ ఎలక్షన్‌ అథారిటీ షెడ్యూల్‌ ప్రకటించింది. వచ్చే నెల 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ఉంటుంది. అదే రో జు మధ్యాహ్నం 2 తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.


90,847 మంది సొసైటీ ఓటర్లు...

జిల్లాల పునర్విభజన అనంతరం కామారెడ్డి జిల్లా లో 55 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా లు ఏర్పడ్డాయి. అధికారులు ప్రకటించిన ప్రాథమిక వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లాలోని 55 సొసైటీల్లో మొత్తం 1,44,689 మంది సభ్యులు కాగా 90,847 మంది ఓటర్లున్నారు. అత్యధిక ఓ టర్లు కామారెడ్డి పీఏసీఎస్‌లో 2,766 మంది ఉ న్నారు. ఆ తర్వాత బీర్కూర్‌ పీఏసీఎస్‌లో 2,763 మంది కాగా అతి తక్కువ ఓటర్లున్న సొసైటీగా అంతంపల్లి నిలిచింది. అంతంపల్లి పీఏసీఎస్‌లో అతి తక్కువగా 692 మంది మాత్రమే సభ్యులు ఉండగా, కేవలం 558 మంది ఓటర్లు ఉన్నారు. ఇక సభ్యుల వారీగా పరిశీలిస్తే జిల్లాలో మాచారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అత్యధిక మంది సభ్యులున్నారు. ఈ సొసైటీలో 6,464 మంది సభ్యులుండగా 2,629 మంది ఓటర్లున్నారు. మాచారెడ్డి తర్వాత అడ్లూర్‌ ఎల్లారెడ్డి సొసైటీలో 6,299 మంది సభ్యులున్నారు. ఇక్కడ 2,297 మంది ఓటర్లున్నారు. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతు లు, కొత్తగా సంఘాల్లో సభ్యులుగా చేరిన వారు ఓటు వేసేందుకు గానీ, పోటీ చేసేందుకు గానీ అవకాశం లేదు. సంఘాల్లో సభ్యత్వం తీసుకునేందు కు మాత్రమే అవకాశం కల్పించారు. 2017, డి సెంబర్‌ 31లోపు సంఘాల్లో రూ.300 రుసుము ను చెల్లించి సభ్యత్వం తీసుకున్న రైతులు మాత్ర మే ఓటు వేసేందుకు, పోటీ చేసేందుకు అర్హులుగా గతంలో ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం ఎ లాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

ఆశావహుల్లో ఉత్సాహం...

రైతులకు ఎంతగానో ఉపయోగపడే రైతు సంఘాలకు ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలతో ఇటీవల కాలం వరకు సందడి నెలకొనగా... సొసైటీ ఎన్నికల హడావుడితో రాజకీయం తారా స్థాయికి చేరింది. గతంలో ఉన్న ఓట రు జాబితాలను సవరించి ఆయా పంచాయతీలు, ప్రాథమిక సహకార సంఘాల్లో ప్రదర్శించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏడాది క్రితం సభ్యులుగా చేరిన రైతులు, గతంలో జాబితాల్లో ఓటరుగా ఉండి మృతి చెందిన రైతుల పేర్లు గుర్తించి అర్హులైన ఓటర్ల తుది జాబితాలను రూ పొందించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం సహకార ఎన్నికలకు సిద్ధం అవుతున్న దరిమిలా గ్రామాల్లో రైతులు, రైతు నాయకులు, ఆయా రా జకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులంతా పీఏసీఎస్‌ పదవులపై దృష్టి సారించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవులతో పాటుగా అవసరమైతే డీసీసీబీ పదవులను చేజిక్కించుకోవాలని చాలా రోజుల నుంచి అనేక మంది వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు ఎన్నికల ప్రకటన హడావిడి మొదలవ్వడంతో ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగి పోయారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవి చూసిన వారంతా ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.


logo
>>>>>>