సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 31, 2020 , 03:50:57

విద్యార్థులకు స్వేచ్ఛ కల్పించాలి

విద్యార్థులకు స్వేచ్ఛ కల్పించాలి
  • విలువలు పెంచే విధంగా విద్యాబోధన సాగాలి
  • నిష్ట శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ సత్యనారాయణ

గాంధారి : కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కుష్టు వ్యాధి నిర్మూలన దినం పురస్కరించుకొని మండలంలోని వండ్రీకల్‌ లెప్రసీ క్యాంపులో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ సత్యనారాయణ హాజరై మాట్లాడారు. ప్రతీ సంవత్సరం గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని జాతీయ కుష్టువ్యాధి నివారణ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కుష్టువ్యాధి లక్షణాలు ఉన్నవారు అధైర్యపడవద్దని, వ్యాధిని పూర్తిగా తగ్గించేందుకు మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గాంధీజీ, మదర్‌ థెరిస్సా కుష్టువ్యాధిగ్రస్తులతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని గుర్తుచేశారు. అంటువ్యాధుల బారిన పడకుండా కరచాలనం చేయడానికి బదులుగా నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. జిల్లాల్లో కుష్టు రోగుల సంఖ్య 200 నుంచి 80కి తగ్గిందని తెలిపారు. లెప్రసీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు సేఫ్టీ కిట్లు, గ్లౌజులు, ప్లేట్లు, గ్లాసులు  అందజేశారు. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రగ్గులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భోజప్ప, వైద్యులు శోభారాణి, సాయికుమార్‌, హరికృష్ణ, ఆర్‌ఐ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


డైరీ ఆవిష్కరణ

విద్యానగర్‌ : జిల్లా కేంద్రంలోని విద్యాశాఖలో పని చేస్తున్న క్లస్టర్‌ రిసోస్‌ పర్సన్స్‌ (సీఆర్పీ) ఆధ్వర్యంలో ముద్రించిన డైరీని కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష అభియాన్‌లో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య కార్యక్రమంలో సీఆర్పీల పాత్ర కీలకమన్నారు. డీఈవో రాజు, ఎంఈవో ఎల్లయ్య, సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రాము, సెక్టోరియల్‌ అధికారులు వెంకట్‌, రాములు, గంగాకిషన్‌, జిల్లా కార్యవర్గసభ్యులు సూర్యపాల్‌, చిరంజీవి, ప్రకాశ్‌, శ్రీలత, రాధ, కాళిదాసు, విజయ తదితరులు పాల్గొన్నారు.


విద్యానగర్‌ : పాఠశాలలకు విద్యార్థులు వంద శాతం హాజరయ్యేలా చూడాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు.  జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో నిష్ట శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నది. నాలుగో రోజైన బుధవారం ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు వారి విధులను బాధ్యతతో నిర్వర్తించాలన్నారు. బాల్య దశలోనే ఉన్న విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, ఇంటి వాతావరణం పాఠశాలల్లో ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రాజు, ఎంఈవో ఎల్లయ్య, సెక్టోరియల్‌ అధికారులు వెంకట్‌, రాములు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.logo