శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 31, 2020 , 03:42:24

మంత్రి కేటీఆర్‌ను కలిసిన కామారెడ్డి మున్సిపల్‌ పాలకవర్గం

మంత్రి కేటీఆర్‌ను కలిసిన కామారెడ్డి మున్సిపల్‌ పాలకవర్గం
  • ప్రజలకు అందుబాటులో ఉండాలి
  • కామారెడ్డి బల్దియా పాలకవర్గం
  • హైదరాబాద్‌లో మంత్రిని కలిసిన
  • పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి మున్సిపల్‌ పాలకవర్గం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జహ్నవితో పాటు కౌన్సిలర్లు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పట్టణ అభివృద్ధికి కృషిచేయాలని పాలకవర్గానికి మంత్రి సూచించారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్‌, టీఆర్‌ఎస్‌  సీనియర్‌ నాయకుడు నిట్టు వేణుగోపాల్‌ రావు, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌ రావు, వైస్‌ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు 27 మంది ఉన్నారు.   


logo