మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Jan 31, 2020 , 03:41:29

ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం

ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని మున్సిపల్‌ చైర్మ న్‌ జంగం గంగాధర్‌ అన్నారు. గురువారం ఆయన  టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల సమక్షంలో  చైర్మన్‌గా బాధ్యత లు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుచ్ఛగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురపోరులో భారీ మెజార్టీతో గెలిపించిన పట్టణ ప్రజలకు ఆయన పాదాభివందనాలు తెలిపారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పట్టణంలో చేసిన అభివృద్ధే తమను భారీ మెజారిటీ గెలిపించిందన్నారు. జీవితాంతం స్పీకర్‌  రుణపడి ఉంటామని చెప్పారు. 


పట్టణంలో వార్డు వారీగా త్వరలోనే ప్రజాదర్బార్లు  ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వార్డు వారీగా సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. అనంతరం సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణాభివృద్ధి, ప్రజాసమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు స్పీకర్‌ త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు దొడ్ల వెంకట్రాం రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు డా క్టర్‌ అంజిరెడ్డి, తాడ్కోల్‌ సొసైటీ అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డి, మాజీ ఏఎంసీ నార్ల సురేశ్‌ గుప్తా, మహ్మద్‌ ఎజాస్‌, నాగుల గామ వెంకన్న , పార్టీ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, అందెరాజు, శ్రీధర్‌, పోతురెడ్డి, ముదిరెడ్డి విఠల్‌ రెడ్డి, బూనేకర్‌ జ్యోతి ప్రకాశ్‌, కౌన్సిలర్లు గదుమల లింగమేశ్వర్‌, పాశం రవీందర్‌ రెడ్డి, దొన్కంటి వెంకటేశ్‌, నార్ల నందకిశోర్‌, రమాదేవి, ఎం.శ్రీనివాస్‌, గైక్వాడ్‌ రుక్మిణి, మోతిలాల్‌,  మాజీ సర్పంచి దొన్కంటి వాణి, నాయకులు హ కీం, కిరణ్‌కుమార్‌, వీరారెడ్డి, అర్బాస్‌, ఆమేర్‌, రమేశ్‌, రఫీ, హైమద్‌ తదితరులు ఉన్నారు.


logo
>>>>>>