శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 31, 2020 , 03:41:29

నీటిని పొదుపుగా వాడుకోవాలి

నీటిని పొదుపుగా వాడుకోవాలి

మాచారెడ్డి : ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. మండలంలోని ఏల్పుగొండలో జిల్లా భూగర్భ జల శాఖ, రిలయన్స్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా భూగర్భ జలాల సమాచారం, యాజమాన్య సంరక్షణ, అభివృద్ధిపై గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీటి ప్రాముఖ్యత, నీటి కాలుష్యంతో కలిగే వ్యాధులను వీడియో రూపంలో అవగాహన కల్పించారు. అనంతరం నీటి కాలుష్యం వలన కలిగే వ్యాధులు, తీసుకోవాల్సిన చర్యలపై ముద్రించిన స్టిక్కర్లను ఆవిష్కరించారు. జడ్పీసీఈవో కాంతమ్మ, భూగర్భ జలశాఖ అధికారి శ్రీనివాస్‌, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రాజేశ్‌, ఎంపీడీవో శ్రీకాంత్‌, సర్పంచ్‌ తిరుపతిరావు, మండల వ్యవసాయశాఖ అధికారి రాజు, ఉద్యాన అధికారి రామకృష్ణ, ఫిషరీస్‌ అధికారి రామకృష్ణ, శ్వేత, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. 


logo