ఆదివారం 29 మార్చి 2020
Kamareddy - Jan 31, 2020 , 03:40:56

నేరాలు అదుపు చేసేందుకే కార్డన్‌ సెర్చ్‌

నేరాలు అదుపు చేసేందుకే కార్డన్‌ సెర్చ్‌
నిజాంసాగర్‌, నమస్తే తెలంగాణ (మద్నూర్‌) : నేరాలను అదుపు చేసేందుకు కార్డన్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. గురువారం తెల్లవారుజామున మద్నూర్‌ మండలం దోతి గ్రామంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన ధ్రువపత్రాలు లేని 67 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. వాహనాదారులు ధ్రువపత్రాలు పోలీసులకు చూపి వాహనాలను తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలు శాంతిభద్రతలు పాటించాలని, పేకాట, మద్యం, మట్కాను పూర్తిగా నిషేధించాలన్నారు. గ్రామాల్లో నిఘా కోసం సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ద్విచక్రవాహన దారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, వాహన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని అన్నారు. గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్డన్‌సెర్చ్‌లో 90 మంది పోలీసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ దామోదర్‌రెడ్డి, ఎస్సై సురేశ్‌, సీఐ సాజిదుల్లా తదితరులు పాల్గొన్నారు.


logo