బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 30, 2020 , 04:08:05

కంగ్రాట్స్‌..

కంగ్రాట్స్‌..

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి కేటీఆర్‌ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్‌ కుడుముల సత్యం, వైస్‌ చైర్‌పర్సన్‌ సుజాత, కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు. పార్టీ తరఫున గెలిచిన ప్రతి నాయకుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధికి సహకరిస్తానని, నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ ఉన్నారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో కౌన్సిలర్లు నునుగొండ భూదేవి, పద్మ శ్రీకాంత్‌, ఎరుకల సాయిలు, నీలకంఠం, అల్లం శ్రీనివాస్‌, భూంగారి రాము, నాయకులు శ్రీనివాస్‌, శ్రావణ్‌ కుమార్‌, ఇమ్రాన్‌, ముజీబ్‌ తదితరులు ఉన్నారు.  


logo
>>>>>>