బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 29, 2020 , 22:24:37

భూగర్భ జలం.. ఆందోళనకరం !

భూగర్భ జలం.. ఆందోళనకరం !
  • వేసవికి ముందే పడిపోతున్న భూగర్భ నీటి మట్టం
  • డిసెంబర్‌ నుంచి జనవరిలోపు మీటరున్నర పతనం
  • యాసంగి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు
  • విచ్చలవిడిగా నీటి వాడకమే కారణం
  • పరిస్థితి ఇలాగే కొనసాగితే మే నెల నాటికి గడ్డు పరిస్థితి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పుష్కలంగా కురిసిన వానలతో జిల్లాలో ఏ మూ లన చూసినా జల సంపద కళకళలాడుతున్నది.  జిల్లాలో గత వానాకాలం తొలి మూడు నెలలు వ రుణుడు ముఖం చాటేశాడు. లోటు వర్షపాతంతో జిల్లా వాసులు తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సెప్టెంబర్‌ నెలలో కురిసిన వానలతో కాస్త ఊరట లభించింది. క్రమక్రమంగా లోటు తగ్గుతూ అధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో అత్యధిక మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో రైతన్నల్లో చిరునవ్వులు వెల్లివిరిశాయి. 2019 అక్టోబర్‌లో భూగర్భ జల మట్టం దాదాపుగా 10 మీటర్ల కు చేరగా అధిక వానలతో నవంబర్‌లో 8.31 మీటర్లకు ఉబికి వచ్చింది. భూగర్భ జలం ఈ రెం డు నెలల్లో అమాంతం పెరిగింది. అయితే, డిసెంబర్‌, 2019లో మాత్రం మీటరు వరకూ భూగర్భ జల మట్టం తగ్గింది. జనవరి 2020 మూడో వారానికి పరిస్థితి మరింతగా క్షీణించింది. డిసెంబర్‌లో 9.24 మీటర్లుగా ఉన్నటువంటి భూగర్భ జల మ ట్టం జనవరికి 10.69 మీటర్లకు పడిపోవడం ఆం దోళనకు గురి చేస్తున్నది. సుమారుగా మీటరున్నర మేర నీటి మట్టం పడిపోతూ వస్తుండడంపై అధికారులు అప్రమత్తతను వ్యక్తం చేస్తున్నారు.


ఒకటే నెలలో మీటరున్నర క్షీణత...

జిల్లా సగటు భూగర్భ జల మట్టం 2019 అక్టోబర్‌ నెలాఖరు నాటికి 9.90 మీటర్లుగా నమోదైంది. 2018, అక్టోబర్‌లో 13.73 మీటర్లుగా నీటి మట్టం రికార్డు అయ్యింది. 2018, 2019 మధ్య కాలం లో సరాసరి 3.84 మీటర్ల మేర భూగర్భ జల మ ట్టం ఎగబాకింది. భూగర్భ జలం పుష్కలంగా అం దుబాటులో ఉండడంతో రైతన్నలు యాసంగి సా గుకు రెడీ అయ్యారు. ఏకధాటిగా భూగర్భ జలాన్ని తోడడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా స్వల్ప కాలంలోనే భూగర్భ జల మట్టం అమాంతం పడిపోవడం ఇప్పుడు భయపెడుతున్నది. పెరిగినట్లే కనిపించిన భూగర్భ జలం ఎండ కాలం మొదలు కాకముందు నుంచి ప్రమాద ఘంటికలను మోగిస్తుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నా రు. జనవరిలోనే మీటరున్నర చొప్పున జల మట్టం క్షీణించగా ఫిబ్రవరి, మార్చిలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ఏప్రిల్‌, మే నాటికి మండు వేసవిలో భూగర్భ జలం అడుగంటడం ఖాయమని అధికారులు పేర్కొంటున్నారు. రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని, సాగుకు నీటి వాడకాన్ని పొదుపుగా చేపట్టాలని సూచనలు చేస్తున్నారు.


భూగర్భ జలం పెరిగినట్లే పెరిగి...

వానాకాలం చివరిలో పడిన వర్షాలతో జిల్లాలోని జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇదే సమయంలో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాం లు నిండు కుండల్లా మారాయి. వాగులు, వంకలైతే రికార్డుల స్థాయిలో పొంగి పొర్లాయి. జూన్‌ ఆరంభంలో ముఖం చాటేసిన వరుణుడు ఆగస్టు నెలాఖరు నుంచి ప్రతాపం చూపించాడు. సెప్టెంబర్‌ మాసం ప్రారంభ సమయానికి జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కాగా అక్టోబర్‌ నెలాఖరుకు అ త్యధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. వా నాకాలం ముగిసిన తర్వాత చలికాలం ప్రారంభంలోనూ వానలు దంచి కొట్టాయి. వానాకాలం సీజన్‌లో పంటల సాగు ఆలస్యంగానైనా ప్రారంభమై గణనీయంగా పెరిగింది. అచ్చంగా యాసంగి సీజన్‌లోనూ ఇదే తరహాలో పంటల విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. అక్టోబర్‌ నెలాఖరు వరకూ పా తాళ గంగ పైపైకి ఎగబాకుతూ వచ్చినప్పటికీ జనవరికి నీటి మట్టంలో తగ్గుదల మీటరుకు పైగా నమోదు కావడం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది.  భూగర్భ జలం పెరిగినట్లే కనిపించినప్పటికీ ఒకే సారి పంటల సాగుకు నీళ్లను ఏకధాటిగా తోడడం వంటి చర్యలతో నీటి మట్టం తగ్గుతుందని నిపుణు లు అంచనా వేస్తున్నారు.


logo
>>>>>>