సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 29, 2020 , 04:50:38

పట్టణ ప్రగతిపై దృష్టి సారించండి

పట్టణ ప్రగతిపై దృష్టి సారించండి

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీల్లో ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన  కౌన్సిలర్లు ప్రజలతో మమేకమై పని చేయాలని, పట్టణ ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ సూచించారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ నాయకుడు, దేశాయిపేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనను చూసి నూతన మున్సిపాలిటీ అయిన బాన్సువాడలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టాం కట్టారన్నారు. 19వార్డులకు గాను 17 వార్డులు భారీ మెజారిటీతో కైవసం చేసుకోవడానికి కృషి చేసిన పోచారం భాస్కర్‌రెడ్డిని ఈ సందర్భంగా కేటీఆర్‌ అభినందించారు. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఎంతో అనుభవం గల నాయకుడని అన్నారు. బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

 కొత్త మున్సిపల్‌ చట్టానికి లోబడి ప్రతిపాలక వర్గ సభ్యుడు ప్రజలకు ఆమోదయోగ్యమైన, అవినీతిరహితమైన పాలన అందించాలని సూచించారు. పట్టణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పట్టణ ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సేవలు అందించాలని మంత్రి సూచించారని మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన  మున్సిపాలిటీ పాలక వర్గ సభ్యులకు మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి, పోతురెడ్డి, పిట్ల శ్రీధర్‌, శివదయాల్‌ వర్మ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌,  టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, కౌన్సిలర్లు తస్లీమా ఫిర్దోస్‌, మోతీలాల్‌, నేహాసుల్తానా, గైక్వాడ్‌ రుక్మిణి, సరిత, దొన్కంటి వెంకటేశ్‌, పాశం రవీందర్‌ రెడ్డి, గంగారపు సుగుణ, లింగమేశ్వర్‌, రమాదేవి, ఎం.శ్రీనివాస్‌, నార్ల నందకుమార్‌, బిట్ల రేణుక , రేష్మాబేగం, సలీమాబేగం, నాయకులు హకీం, నర్సుగొండ, అహ్మద్‌, రఫీ తదితరులు ఉన్నారు.


logo