గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 29, 2020 , 04:46:33

‘ప్రగతి’లో నిర్లక్ష్యంపై కొరడా

‘ప్రగతి’లో నిర్లక్ష్యంపై కొరడా

విద్యానగర్‌ : పల్లె ప్రగతి పనుల్లో వెనుకబడిన 66 గ్రామాల సర్పంచులకు, కార్యదర్శులకు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు డీపీవో సాయన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రెండో విడత పల్లె ప్రగతి పనులు ఈ నెల 2వ తేదీ నుం చి 12వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో నిర్వ హించిన సంగతి తెలిసిందే.  

రెండో విడత కార్యక్రమంలో తప్పనిసరిగా నిర్వహించవలసిన పనుల కార్యాచరణ ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని ఇది వరకే అన్ని గ్రామ పంచాయతీలకు, సంబంధిత అధికారులకు ఆదేశించారు. రెండో విడతలో భాగంగా పారిశుద్ధ్య పనులు, వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డ్‌ లు, తడి చెత్త, పొడి చెత్త కోసం డస్ట్‌ బిన్‌ల ఏర్పా టు, మొక్కలు నాటడం, సంరక్షించడం, ఇంకు డు గుంతల నిర్మాణం, శ్రమదానాలు, నర్సరీల  ఏర్పాటు మొదలగు అంశాల్లో ప్రగతి సాధించకపోవడం, చివరి  మూడు స్థానాల్లో నిలిచిన సంబంధిత 66 గ్రామ పంచాయతీల సర్పంచులకు, పంచాయితీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు కలెక్టర్‌ సత్యనారాయణ జారీ చేశారని డీపీవో తెలిపారు.  


logo
>>>>>>