సోమవారం 30 మార్చి 2020
Kamareddy - Jan 29, 2020 , 04:45:33

బాలలను పనిలో పెట్టుకోవద్దు

బాలలను పనిలో పెట్టుకోవద్దు

పిట్లం : ఇటుక బట్టీల వద్ద బాలలను పనిలో పెట్టుకోవద్దని జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. మండల కేంద్రంలోని చిన్నకొడప్‌గల్‌ సరిహద్దులో ఉన్న ఇటుకబట్టీని మంగళవారం ఆయన సందర్శించి బట్టీ యజమానులతో మాట్లాడారు.  చిన్నారులను పనిలో పెట్టుకోవద్దని, చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇటుక బట్టీల వద్ద ప్రభుత్వం చిన్నారుల కోసం ప్రత్యామ్నాయ పాఠశాలలు, ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు.  ఇటుక బట్టీలలో మహారాష్ట్రకు చెందిన కూలీలు ఉండడంతో చిన్నారులకు మరాఠీ భాష వచ్చే వీవీలను ఏర్పాటు చేసి వారికి బోధన చేస్తామన్నారు. కూలీలకు బీమా సౌకర్యం కల్పించాలని, కార్మికులకు చట్టప్రకారం పని కల్పించాలని బట్టీ యజమానులకు సూచించారు. మద్దెల్‌చెర్వు గ్రామ సమీపంలోని ఇటుక బట్టీని పరిశీలించారు. అనంతరం మద్దెల్‌చెర్వు ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడారు.  గ్రామపంచాయతీని సందర్శించి హరితహారం, 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంపై వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్సై సుధాకర్‌, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, సీఆర్పీలు హైమద్‌పాషా, గోపాల్‌సింగ్‌, పంచాయతీ కార్యదర్శులు అజ్మీరాబేగం, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. 


logo