గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 29, 2020 , 04:45:33

కల్కి చెరువుపై త్వరలోనే బోటింగ్‌

కల్కి చెరువుపై త్వరలోనే బోటింగ్‌

బాన్సువాడ, నమస్తే తెలంగాణ :  బాన్సువాడ పట్టణాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసుకుందామని, కల్కి చెరువుపై కొనసాగుతున్న పనులను  త్వరలోనే  పూర్తి చేస్తామని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ కేంద్రంలోని కల్కి చెరువు కట్టను అలీసాగర్‌ బోట్‌ నిర్వాహకులతో కలిసి సందర్శించారు. మినీట్యాంకు బండ్‌పై అన్ని ఏర్పాట్లు చేశామని, త్వరలోనే ఎకరంన్నర స్థలంలో ప్రజలకు అనువుగా సేదతీరేందుకు పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం కల్కి చెరువుపై బోట్‌ పర్యటనకు స్థలం అనువుగా ఉందా అనే విషయాన్ని బోట్‌ నిర్వాహకులతో కలిసి చర్చించారు. కల్కి చెరువుపై 20 రోజుల్లో తాత్కాలికంగా బోట్‌ను ప్రజల అవసరం మేరకు ఏర్పాటు చేయాలని, కొత్త బోట్‌ వచ్చే వరకు పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించా రు. మినీట్యాంకు  బండ్‌పై వాహనాలను అనుమతించకూడదని పోలీసులను ఆదేశించారు. అనంతరం కట్టపై సేదతీరేందుకు నిర్మించిన గజ్‌ బో లో కూర్చొని సరదాగా యువకులతో ముచ్చటించారు. స్పీకర్‌ పోచారం సాదాసీదాగా మాట్లాడడంతో యువకులు సంతోషం వ్యక్తం చేశారు. 


logo