బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 29, 2020 , 04:39:41

యాంత్రీకరణతో ఇబ్బందులు దూరం

యాంత్రీకరణతో ఇబ్బందులు దూరం

భిక్కనూరు (కామారెడ్డి) : రైతులకు వ్యవసాయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు యంత్రాలతో సాగు అవసరమని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో ఆయన సోమవారం వరి నాటే యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రైతులకు కూలీల కొరత లేకుండా చేసేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయన్నారు. గత 25 సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా రైతులు అత్యధికంగా వరి సాగు చేయడం సంతోషకరమన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు ఇలాంటి యంత్రాలు ఉపయోగపడతాయన్నారు. ఈ యంత్రాలను ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందించేలా తనవంతు కృషి చేస్తానన్నారు. రైతులు అధిక దిగుబడులు పొందాలని ఆకాంక్షించారు. అంతకుముందు జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య వరినాటు యంత్రంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లేశ్‌ మంజుల మల్లారెడ్డి, ఎంపీపీ గాల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాణాల సువర్ణ అమృతరెడ్డి, వైస్‌చైర్మన్‌ కుంచాల శేఖర్‌, డైరెక్టర్లు బుర్రి గోపాల్‌, ఆకుల లలిత, వంగెటి నర్సారెడ్డి, బోరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు కమిటీ మండల కన్వీనర్‌ అందె మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సాయిరెడ్డి, తక్కళ్ల నర్సారెడ్డి, వ్యవసాయాధికారులు శశిధర్‌రెడ్డి, నవీన్‌, ఆనంద్‌, మహేశ్వరీ పాల్గొన్నారు. logo
>>>>>>