శనివారం 28 మార్చి 2020
Kamareddy - Jan 28, 2020 , 00:51:51

గులాబీ పురములో...!

గులాబీ పురములో...!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పాలకవర్గాల గడువు గతేడాది జులై మొదటి వారంతో ముగిసింది. నాటి నుంచి మున్సిపల్‌ పరిపాలన వ్యవస్థ అంతా ప్రత్యేక అధికారి చేతుల్లో కొనసాగుతున్నది. ఆరు నెలల క్రితమే ఎన్నికలు జరగాల్సి ఉండగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. పుర ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు కోర్టుల్లో కేసులు వేస్తూ ఎన్నికలను తీవ్రంగా జాప్యం చేస్తూ వచ్చా యి. రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం చొరవతో మార్గం సు గమం కావడంతో  స్వల్పకాలంలోనే ఎన్నికలు ము గిశాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘా ల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగురవేయగా కామారెడ్డి జిల్లాలోనూ ముచ్చటగా మూడు మున్సిపాలిటీలను కైవ సం చేసుకుంది. మూడు దశాబ్దాల చరిత్ర గల కామారెడ్డి పు రపాలక సంఘంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా ఎగురవేసి చరిత్ర సృష్టించింది. కొత్తగా ఏర్పడిన బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లోనూ తొలి పీఠాలను కారు పార్టీ సొంతం చేసుకుని చారిత్రాత్మకంగా నిలిచిం ది. సోమవారం జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందడి వాతావరణంలో పూర్తి అయ్యింది. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది.

బాన్సువాడ, ఎల్లారెడ్డిలో ఏకగ్రీవంగా...

కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో అత్యధి క కౌన్సిలర్‌ స్థానాలను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి సం పూర్ణ మెజార్టీ ఉంది. ఎల్లారెడ్డిలో 12 వార్డులకు 9 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. 3 స్థానాల్లోనే కాంగ్రెస్‌ గెలిచింది. బాన్సువాడలో 19 వార్డులకు 17 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ప్ర భంజనం సృష్టించగా 2 వార్డుల్లోనే కాంగ్రెస్‌ విజయం సా ధించింది. మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ రెండు చోట్ల చేతు లు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మా త్రమే నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికల నిర్వహణ కు ఆస్కారం లేకుండా పోయింది. మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పోస్టులకు ఒకే నామినేషన్‌ పడడంతో  ఏకగ్రీవంగానే బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల  ఎన్నిక జరిగింది. బాన్సువాడలో జంగం గంగాధర్‌ చైర్మన్‌గా, షేక్‌ జుబేర్‌ వైస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవం అయ్యారు. ఎల్లారెడ్డిలో చైర్మన్‌గా కుడుముల సత్యనారాయణ, వైస్‌ చైర్మన్‌గా ముస్త్యాల సుజాత ఏకగ్రీవమయ్యారు.

కామారెడ్డిలో ఇలా...

కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులున్నాయి. ఇందులో 23 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. కాంగ్రెస్‌కు 12 స్థానాలు వచ్చాయి. బీజేపీకి 8 వార్డులు దక్కాయి. స్వతంత్రులు ఆరు వార్డుల్లో గెలుపొందారు. స్వతంత్రులుగా విజ యం సాధించిన కౌన్సిలర్లు అంతా ఫలితాల రోజే గులాబీ గూటికి చేరారు. సీఎం కేసీఆర్‌ పరిపాలనకు ముగ్ధులై గులా బీ కండువా కప్పుకున్నారు. ఫలితంగా 29 మంది కౌ న్సిల ర్ల బలంతో టీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఉంది. ఎక్స్‌ - అఫిషి యో మెంబర్‌గా స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఓటు ను పరిగణిస్తే 30 ఓట్లు టీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉండడంతో సునాయాసంగా పురపాలక చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నిక సాగింది. బీజేపీ తటస్థంగా ఉండి ఎవరికీ ఓట్లు వేయలేదు. టీఆర్‌ఎస్‌కు 30 ఓట్లు, కాంగ్రెస్‌కు 12 ఓట్లు మాత్రమే రావడంతో గులాబీ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి గడ్డం ఇందుప్రియలు గెలిచారు.

టీఆర్‌ఎస్‌లో సామాజిక న్యాయం..

బడుగు, బలహీన వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్న  తెలంగాణ రాష్ట్ర సమితి తాజాగా మరోమారు ప్రత్యేకతను చాటుకుంది. మున్సిపల్‌ పీఠాలను కట్టబెట్టడంలో మూడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు తమదైన శైలిలో స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటున్నది. 

 ముఖ్యంగా కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వ్‌డు కావడంతో తీవ్రమైన పోటీ ఏర్పడింది. అన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఈ స్థానాన్ని బీసీ మహిళతో పూరించారు. జనరల్‌ మహిళ స్థానా న్ని వెనుకబడిన తరగతులకు చెందిన వారికి కట్టబెట్టడంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పీఠాన్ని గతంలో అధిరోహించిన వారం తా ఉన్నత వర్గాలకు చెందిన వారే కావడంతో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డిలో మున్సిపల్‌ పీఠా లు బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. బాన్సువాడలో సీనియర్‌ నాయకుడైన జంగం గంగాధర్‌కు పదవిని కట్టబెట్టి పోచారం భాస్కర్‌ రెడ్డి తనదైన మార్కును నిలుపుకున్నారు. వైస్‌ చైర్మన్‌ పదవిని మైనార్టీలకు అప్పగించడం ద్వారా ఆ యా వర్గాల్లోనూ మద్దతు కూడగట్టుకున్నారు. ఎల్లారెడ్డిలో చైర్మన్‌ పదవిని పురుషుడికి, వైస్‌ చైర్మన్‌ పదవిని మహిళకు కేటాయించడం ద్వారా ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ప్రత్యేకతను చాటుకున్నారు.


logo