గురువారం 09 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 28, 2020 , 00:48:52

ప్రజలతో మమేకమై పనిచేయండి

ప్రజలతో మమేకమై పనిచేయండి

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 19 కౌన్సిలర్‌ స్థానాలకు పోటీ చేసి గెలుపొందిన కౌన్సిలర్లు ప్రజలతో మమేకమై పనిచేయాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడలోని స్వగృహంలో స్పీకర్‌ను టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ... పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించారని, ప్రజల హృదయాలను గెలిచేలా పనులు చేసి చూపాలని కౌన్సిలర్లకు సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 17 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన వారిని గెలిపించిన పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన వారిలో అహం పెరగవద్దని, బాధ్యతతో పనిచేయాలని సూచించారు. బాన్సువాడ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీపై మొదటిసారి గులాబీ జెండా ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. బాన్సువాడలో అందుబాటులో ఉంటానని, ప్రజలకు అవసరమైన పనులు చేస్తూనే పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పట్టణంలో మరో వెయ్యి డబుల్‌ బెడ్‌రూములు నిర్మించి పేదలకు అందజేద్దామన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువనాయకుడు పోచారం భాస్కర్‌ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ అంజిరెడ్డి, సింగిల్‌ విండ్‌ చైర్మన్‌ ఏర్వాల కృష్ణారెడ్డి, నార్ల సురేశ్‌ గుప్తా, మహ్మద్‌ ఎజాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, పిట్ల శ్రీధర్‌, గురువినయ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, హకీం,అందె రాజు, ఖుర్షీద్‌, ముదిరెడ్డి విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo