ఆదివారం 29 మార్చి 2020
Kamareddy - Jan 28, 2020 , 00:45:06

పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలి

పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలి

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జనహితభవన్‌లో సోమవారం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులను క్లియర్‌ చేయాలని సూచించారు. అనంతరం పల్లెప్రగతిపై సమీక్షించారు. గ్రామాల్లో నర్సరీ మొక్కలకు బ్యాగులు, మట్టి సేకరణ, బ్యాగ్‌ ఫిల్లింగ్‌, విత్తనాల సేకరణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు. పనులు వేగవంతం చేసే విధంగా పంచాయతీ సెక్రెటరీ, మండల పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రతి రోజూ హరితహారం, ప్లాస్టిక్‌ ఏరివేత పనులను చేపట్టేలా చూడాలని పంచాయతీ సెక్రెటరీలకు సూచించారు. ప్రత్యేక అధికారులు సురక్షిత కామారెడ్డిపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలకు విద్యార్థుల గైర్హాజరును నివారించడానికి గ్రామ సమాఖ్య ద్వారా తీర్మానం చేసి చర్యలు చేపట్టాలన్నారు. బాన్సువాడలో మిల్క్‌ చిల్లింగ్‌ సెంటరు ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, సీపీవో శ్రీనివాస్‌, ఏవో పద్మారావు తదితరులు పాల్గొన్నారు.


logo