బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 27, 2020 ,

మువ్వన్నెల రెపరెపలు

 మువ్వన్నెల రెపరెపలు
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
  • ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
  • ప్రతీ వాడలో ఎగిరిన మువ్వన్నెల జెండా

కామారెడ్డి, నమస్తే తెలంగాణ/విద్యానగర్‌: జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆదివారం 71వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా కొనసాగాయి. ఉదయం 9.05 గంటలకు కలెక్టర్‌ సత్యనారాయణ జెండా ఆవిష్కరించిన తర్వాత 9.10 నిమిషాలకు పోలీసుల   గౌరవ వందనం స్వీకరించారు. ఆనంతరం పోలీస్‌లు, ఎన్‌సీసీ విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్‌ చేశారు. 9.15 నిమిషాలకు కలెక్టర్‌ ప్రసంగం ప్రారంభమై 9.41 నిమిషాలకు పూర్తి చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొదటగా వ్యవసాయ శాఖ శకటం, పశువైద్య, పశుసంవర్థక శాఖ శకటం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ శకటం, అటవీ శాఖ శకటం, వైద్య ఆరోగ్య శాఖ శకటం, ఆంగన్‌వాడీ ఐసీడీఎస్‌ శకటం, మిషన్‌ భగీరథ శకటం, పదవ జాతీయ ఓటరు శకటం, రెవెన్యూ శాఖ శకటాలతో ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను శకటాలపై ప్రదర్శించారు. 


అలరించిన సాంసృ్కతిక కార్యక్రమాలు

జిల్లాలోని పలు ప్రభుత్వ గురుకుల పాఠశాలల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంగన్‌వా డీ, ఐసీడీఎస్‌  ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. జుక్కల్‌ బీసీ వసతి గృహం, బాన్సువాడ బాలికల వసతి గృహం, బా న్సువాడ గిరిజన వసతి గృహం, బాన్సువాడ బీసీ వసతి గృహం విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆర్చిడ్స్‌ స్కూల్‌ విద్యార్థులు చేసిన యోగా విన్యాసాలు  అలరించాయి.  కలెక్టర్‌తో పా టు ఉన్నత అధికారులు విద్యార్థులకు ప్రశంసా ప త్రాలు, మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి, జేసీ యాదిరెడ్డి, స్పెషల్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దో త్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌, జిల్లా న్యాయమూర్తి సత్తయ్య, అధికారులు పాల్గొన్నారు.


ఉత్తమ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక బహుమతులు

జిల్లాలో చేపట్టిన పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వంద శాతం పారిశుద్ధ్య పనులు నిర్వహించినందుకు, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులు, తడిపొడి చెత్త కోసం డస్ట్‌బిన్‌లు ఏర్పాటు, హరితహారం మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం, ఇంకుడు గుంతల నిర్మాణం శ్రమదానం, నర్సరీల ఏర్పాటు, పన్నుల వసూలు అంశాల్లో ప్రగతి సాధించిన ప్రతీ మండలంలోని మూడు గ్రామ పంచాయతీలను త్రిసభ్య కమిటీ ద్వారా ఎంపిక చేశారు. ఇలా ఎంపిక  చేసిన 66 గ్రామ పంచాయతీలకు గణతంత్ర   వేడుకల్లో పంచాయతీ పాలక వర్గాలకు, అధికారులకు ప్రశంసా పత్రం, మెమోంటోతో పాటు అత్యధిక ప్రగతి కనబరిచిన గ్రామ పంచాయతీలకు నగదు ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్‌ సత్యనారాయణ అందజేశారు. 66 గ్రామ పంచాయతీల్లో రెండో బహుమతి (95 నుంచి 99 శాతం) మార్కులు సాధించిన బీర్కూర్‌ మండలం రైతు నగర్‌కు రూ.30 వేల  ప్రోత్సాహక బహుమతి, మెమోంటో, ప్రశంసా పత్రం అందజేశారు. మూడవ బహుమతి సాధించిన గ్రామాలకు రూ.20వేల ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఇందులో భిక్కనూర్‌ మండలం అంతంపల్లి, బస్వాపూర్‌ గ్రామాలకు, బీబీపేట మండలంలోని బీబీపేట గ్రామానికి, మల్కాపూర్‌, ఉప్పర్‌పల్లి గ్రామాలకు అందజేశారు. కామారెడ్డి మండలం గర్గుల్‌, రాఘవాపూర్‌ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.


logo
>>>>>>