శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 27, 2020 ,

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

కామారెడ్డి నమస్తే తెలంగాణ,విద్యానగర్‌ : తెలంగాణ పల్లె సీమలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానానికి రూ పకల్పన చేసి గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా పనిచేస్తున్నదని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్‌ యార్డుల కోసం స్థలాలను సేకరించి ని ర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో కోతుల బెడద నివారణకు 83 పంచాయతీల్లో 176 ఎకరాల్లో  61,400 అటవీ ఫల వృక్ష జాతి మొక్కలు నాటి మంకీఫుడ్‌ కోర్టును ఏర్పాటు చేశామని, 58పంచాయతీల్లో 125 ఎకరాల్లో మం కీ ఫుడ్‌ కోర్టుల పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు.  జిల్లాలో భూగర్భ జలాలను పెంచేం దుకు  ఇప్పటి వరకు 70 వేల ఇంకుడు గుంతల ని ర్మాణానికి మంజూరు కాగా 45 వేల ఇంకుడు గుం తల నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచామని అన్నారు.

జిల్లాలో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి...

గత వానాకాలంలో సాధారణ కంటే అధిక వర్ష పాతం నమోదుకావడంతో జిల్లాలోని అన్ని జలాశయాల్లోకి సమృద్ధిగా నీరు వచ్చి చేరడంతో  4,94,688 ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగు చేయడం జరిగిందని అన్నారు. వానాకాలంలో పంట పెట్టుబడి పథకం కింద  2,01,005 మంది రైతుల ఖాతాల్లో 210 కోట్ల 25లక్షల రూ పాయలు జమచేశామని తెలిపారు.   రైతు బీమా కింద ఇప్పటి వరకు జిల్లాలో 802 మంది రైతులు మరణించగా 40 కోట్ల 10 లక్షల రూపాయలను వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో  జమ చేశామన్నారు.  మత్య్సశాఖ 2019-20 సంవత్సరానికి గాను జిల్లాలోని 548 చెరువులో 2 కోట్ల 81 లక్షల చేప పిల్లలను కోటీ 95 లక్షల రూపాయల వ్యవయంతో విడుదల చేయడం జరిగిందని అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ముఖ్య కాలువలు, ఉపకాలువలు ఆధునీకరణకు 469 కోట్ల 45 లక్షల రూపాయలు మంజూరు కాగా ఇప్పటి వరకు 227 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని పేర్కొ న్నారు. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా నాలుగు విడతలలో 1106 చెరువులో 393 కోట్ల రూపాయల అంచనా వ్యవయంతో చెరువుల పునరుద్ధ ర ణ, శాశ్వత మరమ్మత్తు పనులు చేపట్టగా 950 చెరువుల్లో పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు.   జిల్లా లో డబుల్‌ బెడ్‌రూం పథకం కింద రూ.435 కోట్ల 73 లక్షల వ్యయంతో 8,226 ఇండ్ల నిర్మా ణానికి నిధులు మంజూరు కాగా 5,410 ఇండ్ల నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని  అన్నారు. ఇం దులో 2,195 ఇండ్లు  పూర్తి కాగా 2,066 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయని, 1,149 గృహాల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంద ని అన్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 1,59,462 మందికి ప్రతి నెలా రూ.34 కో ట్ల 3 లక్షలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. కల్యా ణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద 2019-20 సంవత్సరానికి గాను 5,276 కుటుంబాలకు రూ.లక్ష 116 అందజేశామన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకంతో  ప్రభుత్వ దవాఖానాల్లో కాన్పులు 58 శాతం నుంచి 73 శాతానికి పెరిగిందని తెలిపారు.  

ఉపాధి హామీ పథకం లో అవార్డులు....

జిల్లాలో చేపట్టిన వివిధ నీటి సంరక్షణ కార్యక్రమా ల ద్వారా జీవనోపాదులను పెంపొందించినందుకు గాను జిల్లా వాటర్‌ విభాగంలో దేశంలో రెండవ స్థానంలో నిలిచి స్కోచ్‌ సిల్వర్‌ అవార్డును అం దుకున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా 2019-20 సంవత్సరంలో కోటీ 46 లక్షల మొక్కలు నాటామన్నారు. పల్లె ప్రగతిలో చేసిన గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ డిమాండ్‌ సర్వే ప్రకారం 2020-21 సంత్సరానికి 72 లక్షల మొక్కలను 526 నర్సరీలలో పెంచుతామన్నారు. జిల్లాలో రైతాంగానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ను విజయవంతంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు.  

మిషన్‌ భగీరథ.....

జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం కింద 2,650 కోట్ల నిధులతో ఎస్సారెస్పీ బాల్కొండ, సింగూర్‌ ప్రాజెక్ట్‌ నీటితో 827 ఆవాసాల్లో తాగు నీరు సరఫరాకు అ వసరమైన 8 ఓహెచ్‌బీఆర్‌, 15 బ్రేక్‌ ప్రెషర ట్యాం కులు, 28 సంపులు, 2 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేశామన్నారు.  ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చే పనుల్లో భాగంగా  600 ట్యాంకులు నిర్మాణం చేపట్టగా 598 ట్యాంకు నిర్మాణం పూర్తయ్యిందన్నారు. మొత్తం  827  ప్రాంతాలకు గాను 817 ఆవాస ప్రాంతాల్లో పను లు పూర్తి చేసి 311  ప్రాంతాల్లో గోదావరి నీటి ని ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నామని తెలిపారు. 

పరిశ్రమల శాఖ....

ప్రభుత్వం తీసుకు వచ్చిన టీఎస్‌ ఐపాస్‌ ద్వారా జిల్లా ఏర్పడిననాటి నుంచి ఇప్పటి వరకు 226 పరిశ్రమలకు సంబంధించి 467 అనుమతుల కోసం  పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోగా 391 అనుమతులు వివిధ శాఖల ద్వారా ఇప్పించామన్నారు.  నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేసినందున టీఎస్‌ఐపాస్‌ బీ కేటగిరి జిల్లాల విభాగం లో జిల్లాకు రెండవ స్థానం దక్కిందని అన్నారు.  

భూరికార్డుల ప్రక్షాళన...

భూరికార్డుల ప్రక్షాలనలో భాగంగా జిల్లాలో 2, 52,686 ఖాతాలకు వంద శాతం పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. పార్ట్‌ బీ ఖాతాల్లోని  చిన్న దోషాలు సరిచేసేందుకు ఈ నెల 2 నుంచి 25 వ తేదీ వరకు ప్రత్యేకంగా సభలు నిర్వహించి 9,600 దరఖాస్తులు స్వీకరించామని కలెక్టర్‌ తెలిపారు. 

కోట్లాది రూపాయలతో పట్టణాభివృద్ధి .. 

టీయూఎఫ్‌ఐడీసీ పథకం కింద కామారెడ్డి బల్దియా కు రూ.60 కోట్ల నిధులు మంజూరు చేశా మని కలెక్టర్‌ తెలిపారు.  ఈ నిధులతో ప్రారం భించిన పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. బాన్సువాడ పురపాలక సంఘానికి రూ. 25 కోట్లు మంజూరు చేశామన్నారు.  ఎల్లారెడ్డి మున్సిపాల్టీకి రూ.25 కోట్లు మంజూరు కాగా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.  


logo