శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 30, 2020 ,

వీధివీధినా మువ్వన్నెల జెండా రెపరెపలు

వీధివీధినా మువ్వన్నెల జెండా రెపరెపలువిద్యానగర్‌ / రాజంపేట / బీబీపేట/ కామారెడ్డి రూరల్‌ / భిక్కనూరు (కామారెడ్డి) / దోమకొండ / మాచారెడ్డి : నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాలు, కాలనీల్లో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. 

రాజంపేట మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో విజయ్‌ కుమార్‌, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సతీశ్‌ కుమార్‌, పీహెచ్‌సీలో మండల వైద్యాధికారి శీరిశ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, రెవెన్యూ కార్యాలయాల్లో వీఆర్వోలు, పంచాయతీ సెక్రెటరీలు జెండా ఆవిష్కరించారు.

బీబీపేట్‌ మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో నర్సింహులు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బాలామణి,  పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్సై శంకర్‌, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం రవీందర్‌, సొసైటీ కార్యాలయం వద్ద సింగిల్‌ విండో చైర్మన్‌ ఎంబరి గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఇంద్రసేనారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు.

దోమకొండ  మండల కేంద్రంలోని ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కోట సదానంద వ్యవసాయ కార్యాలయంలో ఏవో పవన్‌, ప్రాథమిక సహకార సంఘంలో విండో చైర్మన్‌ నర్సారెడ్డి, మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఐరేని నర్సయ్య, రెవెన్యు కార్యాలయంలో తహసీల్దార్‌ అంజయ్య, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై రాజేశ్వర్‌ గౌడ్‌ జాతీయ జెండా ఎగురవేశారు. 

మాచారెడ్డి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీకాంత్‌, పోలీసుస్టేషన్‌లో ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి, విండో కార్యాలయంలో చైర్మన్‌ కంది ప్రభాకర్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. 

కామారెడ్డి మండలంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, జిల్లా కోర్టు సముదాయం, తహసీల్‌ కార్యాలయం, మార్కెట్‌ కమిటీ కార్యాలయం, ప్రాథమిక సహకార సంఘం తదితర ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా ఎగురవేశారు.  

జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు భాను, లయన్స్‌ క్లబ్‌ వివేకానంద ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో క్లబ్‌ అధ్యక్షుడు రవీందర్‌ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, కాటిపల్లి రమణారెడ్డి, టిఎన్జీవోస్‌ భవన్‌లో అధ్యక్షుడు దయానంద్‌ జెండా ఆవిష్కరించారు. సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో, ఎస్‌ఆర్‌కే, ఆర్‌కే, సాందీపని డిగ్రీ కళాశాలల్లో, ఓరియంటల్‌, గంజ్‌ స్కూల్‌, వాగ్దేవి స్కూల్‌, అక్షర, బ్రూక్‌ వ్యాలీ, కెనడీ, లయోలా, ఆర్కిడ్స్‌, వివేకానంద పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 

భిక్కనూరు మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ గాల్‌రెడ్డి ఆధ్వర్యంలో, గాంధీ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి, సీఐ కార్యాలయంలో సీఐ యాలాద్రి, రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ గోవర్ధన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.

లింగంపేట: మండల కేంద్రంలోని సెర్ప్‌ కార్యాలయ ఆవరణలో మండల సమాఖ్య కార్యదర్శి కోమలత, ఏపీఎం చామంతి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. సెర్ప్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వారి ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో సీసీలు గంగారాజు, శ్రావణ్‌, మెహర్‌, స్వప్న, రాజేశ్వర్‌, మండల సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

పిట్లంలో...

పిట్లం : మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనం వద్ద ఐకేపీ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఏపీఎం శిరీష మాట్లాడుతూ.. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఉద్యోగులు శాంత, ఉత్తమ్‌, హన్మాండ్లు, ముత్యంరెడ్డి, శ్రీనివాస్‌, దత్తు తదితరులు పాల్గొన్నారు. 


logo