బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 27, 2020 ,

చెక్‌డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

చెక్‌డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

నిజాంసాగర్‌ రూరల్‌ : మండలంలోని గున్కుల్‌-నిజాంసాగర్‌ గ్రామాల మధ్య చెక్‌డ్యాం నిర్మాణానికి నీటి పారుదల శాఖ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం సలాన్ని పరిశీలించారు. గున్కుల్‌-బంజపల్లి గ్రామ శివారులో వృథాగా మంజీరా నదిలోకి ప్రవహిస్తున్న నీటిని పంట పొలాలకు సాగు నీరు అందించేందుకు వినియోగించుకునేలా చెక్‌డ్యాం నిర్మించనున్నామని నీటి పారుదల శాఖ డీఈఈ రవీందర్‌ తెలిపారు. ఆయన వెంట సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి, దుర్గారెడ్డి, విజయ్‌, విఠల్‌, నారాయణ, ఏఈ బాసిద్‌ తదితరులు ఉన్నారు. 


logo