మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Jan 25, 2020 , 01:46:13

41వ వార్డులో రీపోలింగ్‌ ప్రశాంతం

 41వ వార్డులో రీపోలింగ్‌ ప్రశాంతం
  • - పెరిగిన ఓటింగ్‌ శాతం
  • - పోలింగ్‌కు భారీ బందోబస్తు
  • - కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి


కామారెడ్డి మున్సిపాలిటీలోని 41వ వార్డులో గల ఉర్దూ మీడియం పాఠశాల 101 పోలింగ్‌ కేంద్రంలో శుక్రవారం నిర్వహించి రీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. టెండర్‌ ఓటు పడడంతో రీపోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ బూత్‌లో 580 ఓట్లకు గాను బుధవారం జరిగిన పోలింగ్‌లో 378 ఓట్లు పోలయ్యాయి. శుక్రవారం నిర్వహించిన రీ పోలింగ్‌లో 396 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మీద 68.28 శాతం పోలింగ్‌ నమోదైంది. కేంద్రాన్ని కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి పరిశీలించారు. - కామారెడ్డి/నమస్తే తెలంగాణ

కామారెడ్డి, నమస్తే తెలంగాణ, విద్యానగర్‌ : జిల్లా కేంద్రంలోని 41వ వార్డులోని బతుకమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల 101 పోలింగ్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పోలింగ్‌ స్టేషన్‌ వద్ద బందోబస్తు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల్లో తన ఓటును ఎవరో వేశారని రాజ్‌బీ అనే మహిళ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం రీపోలింగ్‌ నిర్వహించారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో 101 పోలింగ్‌ బూ త్‌లో 580 ఓట్లకు గాను 378 ఓట్లు పోలయ్యా యి. శుక్రవారం జరిగిన రీపోలింగ్‌లో 396 ఓట్లు పోల్‌ అయి 68.28 శాతం పోలింగ్‌ నమోదైంది.     కేవలం 101 పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన వారికి మాత్రమే అవకాశం కల్పించారు. ఉదయం నుంచి పోలింగ్‌స్టేషన్‌ వద్ద వాహనాలు నిలపకుండా, ప్రజ లు గ్రూపులుగా నిలబడకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

పోలింగ్‌స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ శ్వేతారెడ్డి

రీపోలింగ్‌ జరిగిన 41వ వార్డులోని 101 పోలింగ్‌స్టేషన్‌ను కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఓటింగ్‌ ప్రశాంతంగా జరి గే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  పోలీసులు ప్రతి ఓటరునూ ప్రధాన గేట్‌ వద్ద వీడియో తీశారు.

మహ్మద్‌ అనే వ్యక్తి బుధవారం రోజున 103 పోలింగ్‌స్టేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. తిరిగి శుక్రవారం వచ్చి 101 పోలింగ్‌ స్టేషన్‌లో తన ఓటు ఉందని వచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ మహ్మద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నర్సింహులు అనే వ్యక్తి గొల్లవాడ ప్రాం తంలో ఓటు వేశాడని, తిరిగి 41వ వార్డులో శుక్రవారం ఓటు వేయడానికి ప్రయత్నించగా తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌ గుర్తించి తిరిగి పంపించి వేశారు. 

పోలింగ్‌ బాక్స్‌ను తరలించిన అధికారులు....

శుక్రవారం సాయంత5 గంటలకు పోలింగ్‌ ముగియడంతో 5.30 నిమిషాలకు పోలింగ్‌ బాక్సులను అధికారులు సీజ్‌ చేసి ప్రత్యేక వాహనంలో తరలించారు. పోలీసు బందోబసుత మధ్య పోలింగ్‌ బాక్స్‌ను తరలించారు. ప్రశాంతంగా ఓటింగ్‌ ముగియడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.logo
>>>>>>