శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 25, 2020 , 01:45:11

భక్తజన సందోహం..

భక్తజన సందోహం..
  • -పుష్య బహుళ అమావాస్య సందర్భంగా..
  • -శ్రీభీమేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు
  • -పుణ్య స్నానాలు ఆచరించి.. ప్రత్యేక పూజలు
తాడ్వాయి: పుష్య బహుళ అమావాస్య సందర్భంగా మండ ల పరిధిలోని సంతాయిపేట గ్రామ శివారులో గల శ్రీభీమేశ్వర జాతర శుక్రవారం ఘనంగా జరిగింది. ఆలయాన్ని తాకుతూ దక్షిణం వైపు పారుతున్న వాగులో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో పుణ్య స్నా నాలు ఆచరించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆల య కమిటీ అంచనాలకు మించి భక్తులు తరలివచ్చారు. మండలంలోని గ్రామాలకు చెందిన వారే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, బైక్‌లపై భారీగా తరలివచ్చారు. వాహనాల పార్కింగ్‌కు ముందుగానే స్థలం కేటాయించి అన్ని ఏర్పాట్లు చేశారు. సీఐ వెంకట్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రతలు తీసుకున్నారు. భీమేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఆర్టీసీ బస్సులు ఆల యం వరకు నడిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు దా దాపు లక్షమంది మంది భక్తులు వాగులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు వేశారు. ట్రాఫిక్‌ సమస్య, భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయకమిటీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సర్పంచి భాగ్యలక్ష్మి, సీఐ వెంకట్‌, ఎస్సై కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 

ఆలయాభివృద్ధికి కృషి

భీమేశ్వరాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ప్రత్యేక అభిషేక పూజలు చేశారు.అనంతరం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ భీమేశ్వరుని కృపతో అందరు సంతోషంగా ఉండాలని అన్నారు.భీమేశ్వరాలయ అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం చిట్యాల గ్రామ సమీపంలో గల రాజరాజేశ్వరాలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ రవి, జడ్పీటీసీలు రమాదేవి, కొండ హన్మాండ్లు, నర్సింలు, ఏఎంసీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, వైస్‌ ఎంపీపీ నర్సింలు, ఆలయ కమిటీ చైర్మన్‌ మహిపాల్‌రెడ్డి, సర్పంచి భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ రాజమణి, టీఆర్‌ఎస్‌ నాయకులు మహేందర్‌రెడ్డి, ప్రభాకర్‌, గంగారెడ్డి,రవీందర్‌రెడ్డి, రాజాగౌడ్‌, శివరాములు తదితరులు పాల్గొన్నారు.

భక్తుల సేవలో భీమ సేన సేవకులు

సంతాయిపేటలోని శ్రీ భీమేశ్వర దేవస్థానం వద్ద పుష్య బహుళ అమావాస్య సందర్భంగా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామానికి చెందిన భీమసేన ఫెడరేషన్‌ (బీఎస్‌ఎఫ్‌) సేవకులు భక్తులకు దేవస్థానం వద్ద ఉచితంగా చల్లని తాగునీటిని పంపిణీ చేశారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటిని పంపిణీ చేశారు. భీమసేన సేవకులు ప్రతి సంవత్సరం అమావాస్య సందర్భంగా ఉచితంగా తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 5వేల లీటర్ల చల్లటి తాగునీటిని పంపిణీ చేశారు. వారి సేవలను ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌, భక్తులు, ఎస్సై కృష్ణమూర్తి అభినందించారు. భక్తులకు తమవంతు కృషిగా ఉచితంగా తాగునీటిని పంపిణీ చేయడం ఆనందాన్ని ఇచ్చిందని భీమసేన సేవకులు తెలిపారు.


రోజురోజుకూ పెరుగుతున్న భక్తులు

శ్రీభీమేశ్వరాలయ విశిష్టత రోజురోజుకు భక్తులకు తెలుస్తుండడంతో ప్రతి ఏటా భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. మాఘ అమవాస్య సందర్భంగా వాగులో పుణ్య స్నానాలు ఆచరించి భీమేశ్వరున్ని దర్శించుకుంటున్నారు.
- రాజేశ్వర్‌రావు, ఆలయ పూజారి


logo