మంగళవారం 07 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 25, 2020 , 01:44:38

మొక్కల సంరక్షణకు కృషిచేయాలి కలెక్టర్‌ సత్యనారాయణ

మొక్కల సంరక్షణకు కృషిచేయాలి కలెక్టర్‌ సత్యనారాయణ
బీబీపేట్‌: మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని నర్సరీని పరిశీలించి ఆయన శుక్రవారం పరిశీలించారు. వాటర్‌ డేలో భాగంగా నర్సరీలోని మొక్కలకు ప్రజాప్రతినిధులతో కలసి నీరు పోశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. నాటిన మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ పరికి ప్రేమ్‌కుమార్‌, సర్పంచ్‌ లక్ష్మి, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, తహసీల్దార్‌ నర్సింహులు, ఎంపీడీవో నారాయణ, ఎంపీవో వెంకటనర్సయ్య, ఏపీవో రాధిక, ఉపసర్పంచ్‌ సాయినాథ్‌, ఎంపీటీసీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రశాంత్‌, వార్డుసభ్యులు, గ్రామస్తులు తది తరులు పాల్గొన్నారు.

మొక్కల సంరక్షణకు కృషిచేయాలి

మొక్కల సంరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మల్కాపూర్‌లో నర్సరీకి ఏర్పాటు చేసిన గేటును వారు శుక్రవారం ప్రారంభించారు. వాటర్‌డేలో భాగంగా నర్సరీలోని మొక్కలకు నీరు పోశారు. మొక్కలు ఎండిపోకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాంరెడ్డి, వార్డు సభ్యులు, ఎంపీడీవో నారాయణ, తహసీల్దార్‌ నర్సింహులు, ఎంపీవో వెంకటనర్సయ్య, ఏఎస్సై రాములు, ఏపీవో రాధిక, ఎంపీటీసీ సుజాత, ఉపసర్పంచులు రవి, సాయినాథ్‌, వీఆర్వో హన్మాండ్లు, పంచాయతీ కార్యదర్శి కల్యాణ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కృపాల్‌రెడ్డి, పాలకవర్గసభ్యులు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.
logo