గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 24, 2020 , 02:01:29

అధ్యక్ష పీఠం అధిరోహించేదెవరో..?

అధ్యక్ష పీఠం అధిరోహించేదెవరో..?టీఆర్‌ఎస్‌లో గెలుపు ధీమా... అందరి చూఅధ్యక్ష పీఠం అధిరోహించేదెవరో..?పు చైర్మన్‌ ఎన్నిక పైనే..


మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ పూర్తికావడంతో ఇప్పుడు అన్నిపార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల్లో ఈ నెల 25న వెల్లడించనున్న ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. దీంతోపాటు అభ్యర్థులందరిలోనూ చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌
పీఠాలను అధిరోహించే వారెవరన్న దానిపై సర్వత్రా చర్చ కొనసాగుతున్నది. ఫలితాలు వెల్లడించగానే జిల్లా
ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యనారాయణ ఆయా మున్సిపాలిటీలకు ప్రిసైడింగ్‌ అధికారులను నియమిస్తారు.
వీరి ఆధ్వర్యంలోనే శనివారం జరిగే మున్సిపల్‌ చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికను నిర్వహిస్తారు. గెలుపొందిన కౌన్సిలర్లందరితో అదే రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ఒక వేళ అనివార్య కారణాలతో 27న ఎన్నిక జరగకపోతే 28న ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బాన్సువాడలో టీఆర్‌ఎస్‌ ముందస్తుగానే చైర్మన్‌ అభ్యర్థిగా 15 వార్డు నుంచి పోటీ చేస్తున్న జంగం గంగాధర్‌ పేరును ఖరారు చేసింది. ఎల్లారెడ్డి, కామారెడ్డిలో టీఆర్‌ఎస్‌ తరఫున చైర్మన్‌ పీఠం అధిరోహించేదెవరో ఇప్పటికీ తేలలేదు. కామారెడ్డి మున్సిపల్‌ పీఠం ఈసారి కూడా జనరల్‌ మహిళకు రావడంతో పోటీ తీవ్రంగానే ఉంది. ఎల్లారెడ్డి పుర చైర్మన్‌ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో.. ఆయా వర్గాల్లోనూ పోటీ ఏర్పడింది. పుర పీఠాలు ఎవరికి దక్కుతాయన్నది మాత్రం సోమవారం మధ్యాహ్నం స్పష్టం కానుంది.      
 - కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పురపాలక ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడందరి చూపు ఓట్ల లెక్కింపు, ఫలితాలపై దృష్టి కేంద్రీకృతమైంది. రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25న ఫలితాలను వెల్లడించబోతున్నారు. 27న పురపాలక మండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు సైతం పూర్తి చేస్తున్నది. ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశారు. రాజకీయ పార్టీలకు సైతం లెక్కింపు ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల మాదిరిగానే ఓట్ల లెక్కింపునూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఫలితాల రోజునే గెలుపొందిన కౌన్సిలర్లందరికీ పురపాలక సంఘం కమిషనర్లు నోటీసులు అందిస్తారు. 27న జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరవ్వాల్సిందిగా అందులో పేర్కొంటారు. హాజరైన సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్ల పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు.

చకచకా ఏర్పాట్లు...

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో రంగంలోకి దిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక ఎన్నికలను చకచకా నిర్వహిస్తున్నది. షెడ్యూల్‌ ప్రకారం పక్కాగా ఎన్నికల ప్రక్రియ ముందుగు సాగుతున్నది. ఒక్కో దశను దాటుకుని పురపాలక పోరులో చివరి అంకానికి యంత్రాంగం చేరుకుంది. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తికావడంతో రేపు మున్సిపాలిటీ పోరులో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. బ్యాలెట్‌ బాక్సుల్లో దాగి ఉన్న ఓటరు మహాశయుల తీర్పు రేపు మధ్యాహ్నానికి స్పష్టంగా వెల్లడికానుంది. ఫలితాల వెల్లడి పూర్తయిన వెంటనే తర్వాత రోజు గణతంత్ర దినోత్సవం ఉంది. మరుసటి రోజు సోమవారం పురపాలక సంఘాలకు నూతన పాలక మండలి ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఇప్పుడంతా అభ్యర్థులందరిలోనూ మున్సిపల్‌ పీఠం అధిరోహించేదెవరన్న దానిపై తీవ్ర చర్చ సాగుతున్నది. శనివారం ఫలితాలు వెల్లడి కాగానే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యనారాయణ ఆయా మున్సిపాలిటీలకు ప్రిసైడింగ్‌ అధికారులను నియమిస్తారు. వీరి ఆధ్వర్యంలోనే సోమవారం జరిగే మున్సిపల్‌ చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికను నిర్వహిస్తారు. శుక్రవారం 41 వార్డులోని 101 పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇక్కడ పోలైన ఓట్లను యథావిధిగా శనివారమే లెక్కించనున్నారు.


పీఠాధీశులపై ఉత్కంఠ...

కామారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి. కామారెడ్డిలో 49 వార్డులకు ఎన్నికలు జరిగాయి. బాన్సువాడలో 19 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం కాగా 18 వార్డులకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఎల్లారెడ్డిలో 12 వార్డుల్లో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. పురపోరు ముగిసిందో లేదో చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ పీఠాలను అధిరోహించే వారెవరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్నది. బాన్సువాడలో మాత్రం టీఆర్‌ఎస్‌ పార్టీ ముందస్తుగానే చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించింది. 15 వార్డు నుంచి పోటీ చేస్తున్న జంగం గంగాధర్‌ పేరును ఖరారు చేశారు. ఎల్లారెడ్డి, కామారెడ్డిలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున చైర్మన్‌ పీఠం ఎక్కేదెవరో ఇప్పటికీ తేలలేదు. దీంతో ఆయా వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కామారెడ్డి మున్సిపల్‌ పీఠం ఈసారి కూడా జనరల్‌ మహిళకు రావడంతో పోటీ తీవ్రంగానే ఉంది. ఎల్లారెడ్డి పుర చైర్మన్‌ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో ఆయా వర్గాల్లోనూ పోటీ ఏర్పడింది. ఎవరికి పుర పీఠాలు దక్కుతాయన్నది మాత్రం సోమవారం మధ్యాహ్నం స్పష్టం కానుంది.


టీఆర్‌ఎస్‌లో గెలుపు ధీమా...

పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాలు రేపు వెల్లడి కానుండడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులంతా గెలుపు తమదేనంటూ కొండంత ధీమాతో ఉన్నారు. ప్రజల ఆశీస్సులతో తప్పకుండా బ్రహ్మాండమైన గెలుపును సొంతం చేసుకుంటామనే విశ్వాసంతో వారంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం ఎవరికి వారే ధీమాతో ఉన్నప్పటికీ పరువు నిలబడితే చాలు అన్నట్లుగా ఆయా పార్టీల నేతలంతా భావిస్తున్నారు. బుధవారం జరిగిన పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే కామారెడ్డి పట్టణ ఓటర్లంతా అభివృద్ధికే జై కొట్టినట్లుగా పలు సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ తేటతెల్లం చేస్తున్నాయి. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని కామారెడ్డి పురపాలక చరిత్రలో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే రకమైన ఉత్సాహం ఎల్లారెడ్డి, బాన్సువాడల్లోనూ కనిపిస్తున్నది. ఇక్కడ కూడా గులాబీ పార్టీ చేసిన అభివృద్ధికే ప్రజలంతా పట్టం కట్టినట్లుగా తెలుస్తున్నది. ఫలితాలకు ఒక రోజే మిగిలి ఉండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరికొందరైతే కౌన్సిలర్‌గా గెలిసిస్తే పుర అధ్యక్ష పీఠంపై కన్నెయ్యాలనే ఆలోచనతోనూ చక్రం తిప్పుతున్నట్లుగా తెలుస్తున్నది.


కొలువు దీరనున్న కొత్త పాలక మండలి...

తెలంగాణ రాష్ట్రంలో తొలి పురపాలక సంఘం పాలక మండళ్లు సరిగ్గా అర్ధ సంవత్సరం తర్వాత కొలువుదీరబోతున్నాయి. శనివారం ఫలితాల అనంతరం మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల కోసం ఈ నెల 27న పరోక్ష ఎన్నిక జరుగనుంది. ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఒకే రోజు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం, తదనంతరం చైర్మన్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు జరగనున్నాయి. 27న ఉదయం పాలక మండళ్లు ప్రత్యేకంగా సమావేశమవుతాయి. ప్రత్యేక సమావేశం కోసం ఈ నెల 25న అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. 27 ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్‌ ఎన్నిక చేపడతారు. అనంతరం డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. ఒక వేళ అనివార్య కారణాలతో 27న ఎన్నిక జరగకపోతే 28న ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. చైర్మన్‌ ఎన్నిక కాకుండా డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక చేపట్టరాదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.logo