బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 24, 2020 , 02:01:29

వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
  • -మాఘ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు
  • -నేడు జాతరమాచారెడ్డి: మండలంలోని గజ్యానాయక్‌ తండా ఎక్స్‌రోడ్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో  మాఘ అమావాస్య సందర్భంగా ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ సేపూరి శ్రీనివాసా చారి తెలిపారు.
ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు ఆలయ ఆవరణలో జాతర నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని, శుక్రవారం వేకువజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాటు చేశారు. ఇప్పటికే రంగులు వేసి ఆలయాన్ని ముస్తాబు చేశారు.logo