గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 22, 2020 , 00:43:29

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యనస్రుల్లాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని రిజిస్టర్లు , వంటశాలలో భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో వాలీబాల్‌ ఆడారు. ప్రిన్సిపాల్‌ వెంకటనారాయణతో మాట్లాడి పాఠశాల వసతులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పిల్లలకోసం మెరుగైన విద్యను అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. సాంఘిక సంక్షేమ, మైనార్టీ, వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1095 గరుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ఆయన వెంట ఎంపీపీ పాల్త్య విఠల్‌, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మాజిద్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పెర్క శ్రీనివాస్‌, విండో చైర్మన్‌ గంగారాం, మాజీ ఎంపీటీసీలు కంది మల్లేశ్‌, మహేందర్‌, నాయకులు ప్రతాప్‌, రాము, సాయిలు, నారాయణ, బాలమల్లుగౌడ్‌, సాయి కుమార్‌, బాట కృష్ణ, బబ్బు తదితరులు ఉన్నారు.


logo
>>>>>>