బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 22, 2020 , 00:42:47

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
  • -టేక్రియాల్‌ చౌరస్తా వద్ద ఘటన
  • -రోడ్డు దాటుతుండగా ఢీకొన్న బొలెరో వాహనం
  • -అక్కడిక్కడే దుర్మరణం
  • -మృతులు లింగంపేట మండలం మోతెవాసులు


కామారెడ్డి రూరల్‌ : కామారెడ్డి మండల పరిధిలోని టేక్రియాల్‌ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భా ర్యాభర్తలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన చందు సింగ్‌ (55), భార్య బేకత్‌ కౌర్‌(50) ఇద్దరు గాంధారిలో బంధువులను, కామారెడ్డిలో కూతురిని కలిసేందుకు బైక్‌పై బయలుదేరారు. బైక్‌పై సదాశివనగర్‌ వైపు నుంచి వస్తూ టేక్రియాల్‌ స్టేజీ వద్ద రోడ్డును దాటుతుండగా కామారెడ్డి వైపు నుంచి సదాశివనగర్‌ వైపు వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌ ఉన్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని తీసుకుని మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.logo