మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Jan 21, 2020 , 00:56:09

సుందర పట్టణంగా కామారెడ్డి

సుందర పట్టణంగా కామారెడ్డి
  • -ఐదేండ్లలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు
  • -పూర్తయిన డివైడర్‌, సీసీ రోడ్ల నిర్మాణాలు
  • -అధునాతన పార్కులు ..
విద్యానగర్‌: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ అభివృద్ధి వైపు పయనిస్తోంది. జిల్లాల పునర్విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన కా మారెడ్డి జిల్లా కేంద్రం దినదినాభివృద్ధి చెందుతోం ది. ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే అతి పొడవైన జాతీయ రహదారి 44ను ఆనుకొని ఉన్న పట్టణం.. దేశ నలుమూలలకు అనుసంధానమైన రైల్వేలైన్‌లో అంతర్భాగమైన కామారెడ్డి రైల్వే స్టేషన్‌ కలిగి ఉండి సరకుల రవాణా, ప్రజా రవాణాకు మెరుగైన వసతులతో కూడిన కామారెడ్డి పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందింది. పట్టణీకరణ సుందరీకరణలో భా గంగా కామారెడ్డి మున్సిపాలిటీ కోట్ల రూపాయల తో తళుక్కుమంటోంది. రాజధానిలో కనిపించే సెం ట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, కాలనీల మధ్య సీసీ రోడ్ల అ నుసంధానం, పార్కుల అభివృద్ధి, పట్టణవాసుల కోసం ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు, ప్రధాన రహదారు ల విస్తరణ, జంక్షన్‌ల అభివృద్ధితో పట్టణం సుందరంగా మా రింది. పట్టణంలోని విద్యానగర్‌, ఆర్యనగర్‌, వి ద్యుత్‌ కాలనీ, స్నేహపురి కాలనీ, అశోకనగర్‌ కాలనీల్లో సీసీ రోడ్లు వేశారు. నిజాంసాగర్‌ చౌరస్తా నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు సెం ట్రల్‌ లైటింగ్‌, పూల మొక్కలతో ఆధునీకరించారు.

పట్టణీకరణ సొబగులు...

దేవునిపల్లి ఒకప్పుడు కుగ్రామం. కామారెడ్డి పట్టణానికి శివారులో సుదూరంలో విసిరేసినట్లుగా నెలకొన్న ప్రాంతం. రోజురోజుకూ కామారెడ్డి పట్టణం విస్తరించడం, జిల్లా అయిన తర్వాత అనూహ్యంగా అభివృద్ధి చెందడంతో దేవునిపల్లి ప్రాంతం పట్టణంలో ఓ భాగమైంది. కొత్త పురపాలక చట్టంతో ఈ గ్రామం ప్రస్తుతం వార్డుగా మారింది. 14 చదరపు కిలో మీటర్లుగా ఉన్న పట్టణం ఇప్పుడు 61.50 చదరపు కిలో మీటర్లకు విస్తరించింది.

కామారెడ్డిలో చేపట్టిన అభివృద్ధి పనులు

-రూ.6కోట్లతో ఆడిటోరియం
-రూ.2.60కోట్లతో మోడల్‌ మార్కెట్‌
-రూ.2కోట్లతో జంక్షన్‌ల అభివృద్ధి
-రూ.1.22కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌
-రూ.1.80 కోట్లతో 4పార్కుల అభివృద్ధి
-రూ.2 కోట్లతో రెండు వైకుంఠధామాల అభివృద్ధి
-రూ.4 కోట్లతో పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట డ్రైనేజీ సిస్టమ్‌ నిర్మాణం
-రూ.18.18 కోట్లతో పలు కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువల ఆధునికీకరణ పనులు
-కామారెడ్డి పట్టణమే కేంద్రంగా జిల్లా ఏర్పా టు కావడంతో జన సంచారం, వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా అందుకు తగ్గట్లుగా మౌళిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ. 100 కోట్లతో కామారెడ్డి పట్టణ రూపురేఖలను మార్చింది.logo
>>>>>>