సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 19, 2020 , 01:16:00

పోలింగ్‌ ప్రక్రియను నిరంతరం పరిశీలించాలి

పోలింగ్‌ ప్రక్రియను నిరంతరం పరిశీలించాలి
  • -మున్సిపల్‌ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకుడు సందీప్‌ కుమార్‌ ఝా
  • - మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను నిరంతరం పరిశీలించాలని,  పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకుడు సందీప్‌కుమార్‌ ఝా మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జనహిత భవన్‌లో శనివారం జిల్లాలోని 44 మంది మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. పోలింగ్‌ ఏజెంట్ల హాజరు, బ్యాలెట్‌ బాక్స్‌ ఏర్పాటు నుంచి ఓటర్ల ప్రవేశం, నిష్క్రమణ, పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ బాక్స్‌కు సీలింగ్‌ వేయడం తదితర ప్రక్రియపై నివేదిక తయారు చేయాలని చెప్పారు. పోలింగ్‌ ముగింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.    - కామారెడ్డి, నమస్తే తెలంగాణ

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: ఈ నెల 22న నిర్వహించే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను నిరంతరం పరిశీలించాలని మున్సిపల్‌ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకుడు సందీప్‌ కుమార్‌ ఝా మైక్రో అబ్జర్వర్‌లకు సూచించారు. కామారెడ్డిలోని జనహిత భవన్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 44 మైక్రో అబ్జర్వర్లకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ ప్రక్రియను నిరంతరం గమనించాలన్నారు. బ్యాలెట్‌ బాక్సు సిద్ధం చేసేటప్పుడు పోలింగ్‌ ఏజెంట్ల హాజరు, సీల్‌ను గమనించడం ఎలక్ట్రోరల్‌ రోల్‌ మార్క్‌డ్‌ కాపీని ప్రీసైడింగ్‌ అధికారి పోలింగ్‌ ఏజెంట్లకు చూపించడం, ఓటర్ల ప్రవేశ, నిష్క్రమణ సరిగ్గా జరుగుతుందా, బ్యాలెట్‌ పేపర్‌ కౌంటర్‌ ఫైల్‌ నిర్వహణ ఓట్ల గోప్యతను కాపాడేలా ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌ అమరిక , ప్రిసైడింగ్‌ ఆధికారి డైరీ నమోదు, పోలింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్స్‌కు సీల్‌ వేయడం, పరిశీలించిన మొత్తం పోలింగ్‌ ప్రక్రియ నివేదిక తయా రు చేయాలని చెప్పారు.

పోలింగ్‌ స్టేషన్‌ బయట ఏర్పాట్లు పరిశీలించి, పోలింగ్‌ స్టేషన్‌ బయట ఓటు వేసే ఓటర్ల క్రమసంఖ్య, పోటీ చేసే అభ్యర్థుల క్రమసంఖ్య, గుర్తులతో కూడిన జాబితా ప్రదర్శించేలా చూడడం, పోలింగ్‌ స్టేషన్‌ పరిసరాల్లో శాంతి భద్రతలకు సంబంధించి పోలింగ్‌ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో వాహనాలను అనుమతించవద్దని, ప్రచారానికి తావివ్వకూడదని, రహస్య ఓటింగ్‌కు అవాంతరం కలగకుండా చూడాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియను వీడియో, వెబ్‌క్యామ్‌ ద్వారా రికార్డు చేయాలని, ఓటరు ఓటు వేయడాన్ని ప్రిసైడింగ్‌ అధికారి, పోలింగ్‌ ఏజెంట్లు, పోలింగ్‌ అధికారులు ఎవరూ చూడకుండా ఉండేలా ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌ అమరిక  చేయాలన్నారు. నిబంధనల మేరకు పోలింగ్‌ ఏజెంట్లు కూర్చునే క్రమం, పోలింగ్‌ ఏజెంట్ల నియామకం, ఓటర్ల నిర్ధ్దారణ, ఛాలెంజ్‌ ఓటు, టెండర్డ్‌ ఓటు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడం, పోలింగ్‌ ముగింపు సమయంలో నిర్వహించాల్సిన పనులపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రత్యేకాధికారి వెంకటేశ్‌ దోత్రె, జిలా పరిశ్రమల అధికారి రఘునాథ్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ వరప్రసాద్‌, లైజనింగ్‌ అధికారి భాస్కర్‌ పాల్గొన్నారు.logo