శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 19, 2020 , 01:14:41

కాంగ్రెస్‌, బీజేపీలను చిత్తుగా ఓడించండి

కాంగ్రెస్‌, బీజేపీలను చిత్తుగా ఓడించండి
  • - ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఆ రెండు పార్టీలకు లేదు
  • - ఎన్నికల ప్రచార సభలో నిప్పులు చెరిగిన మజ్లిస్‌ అధినేత
  • - షబ్బీర్‌ అలీపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ
  • - ప్రచార సభకు భారీగా తరలివచ్చిన జనం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎంఐఎం పార్టీ రోజురోజుకూ దేశ వ్యాప్తంగా విస్తరిస్తూ ముందుకు సాగుతున్నదని మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. వరుస ఎ న్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుంటే కాంగ్రెస్‌, బీజేపీలకు దడ పుడుతున్నదని విమర్శించారు. కా మారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంతకు ముందు ఎప్పుడూ ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఇప్పు డు ఆరు వార్డుల్లో కౌన్సిలర్‌ అభ్యర్థులు పోటీ చేస్తుంటే కాంగ్రెస్‌ నాయకుడొకరికి నిద్ర కూడా పట్టడం లేదంటూ పరోక్షంగా షబ్బీర్‌ అలీని ఉటంకిస్తూ ఆరోపించారు. కలలో కూడా ఎంఐఎం పా ర్టీయే ఆయనకు గుర్తుకు వస్తున్నదంటూ వ్యంగ్యస్ర్తాలు విసిరారు. కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంఐఎం  నుంచి 5, 8, 24, 31, 42, 48 వార్డుల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్‌ అభ్యర్థుల కోసం శనివారం ఈద్గా మైదానంలో నిర్వహించిన ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్పీఆర్‌, ఎన్సీఆర్‌ వేర్వేరు కాదని, సీఏఏ పేరుతో భారతీయ జనతా పార్టీ  ముస్లిములను ఈ దేశం నుంచి వెళ్లగొట్టే కుట్రలకు చేస్తున్నదని ఒవైసీ నిప్పులు చెరిగారు. సీఏఏకు అనుకూలంగా ఓట్లు వేసిన శివసేనతో కాం గ్రెస్‌ పార్టీ సైతం పొత్తు పెట్టుకోవడం అనైతిక పెండ్లితో సమానమని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

సీఏఏపై మున్సిపల్‌ ఎన్నికలే రెఫరెండం...

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్టు(సీఏఏ)పై ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలను బీజేపీ రెఫరెండంగా తీసుకోవాలని మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్‌ విసిరారు.  రాష్ట్రం లో ఏ ఒక్క చోట బీజేపీకి మున్సిపల్‌ పీఠం దక్కనివ్వకుండా ముస్లిం ప్రజలంతా  పని చేయాలని హితబోధ చేశారు. తన తండ్రి హయాం నుంచి కామారెడ్డి ప్రాంతంలో పార్టీ ఉందని అసదుద్దీన్‌ గుర్తు చేశారు. 70 ఏండ్లలో మజ్ల్లిస్‌ పార్టీ ప్రజల సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసిందని, భవిష్యత్తులోనూ చేయబోతోందని  స్పష్టం చేశా రు.  2009 ఎన్నికల నుంచి ఎంఐఎం ఓడిపోతుందని ప్రచారం చేసినప్పటికీ 2014, 2019 ఎన్నికల్లోనూ మజ్లిస్‌ పార్టీ అజేయంగా గెలిచిందని వివరించారు.

శివసేన, కాంగ్రెస్‌లదీ అక్రమ పెండ్లి

మహారాష్ట్రలో కాంగ్రెస్‌, శివసేనల పార్టీల మ ధ్య పొత్తుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ తనదైన శైలిలో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. శివసేన, కాంగ్రెస్‌ పార్టీల పెండ్లి అక్రమమైందని చెప్పారు. శివసేన, కాంగ్రెస్‌లు కలిసి పెండ్ల్లి చేసుకుంటే ఎన్సీ పీ అధినేత శరద్‌పవార్‌ రిసెప్షన్‌ చేసుకున్నాడం టూ ఛలోక్తులు విసిరారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు మొదట్లో మద్దతు ఇచ్చి తర్వాత ఉపసంహరించుకున్న పార్టీ కాంగ్రెస్‌ కాదా? అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ పాలన హిట్లర్‌ పాలనను తలపిస్తున్నదని, మోడీ అండ్‌ షాకు హిట్లర్‌కు పట్టిన గతి పడుతుందని పేర్కొన్నారు. సౌత్‌ ఆఫ్రికాలో నల్లజాతీయులపై తీసుకు వచ్చిన చట్టాన్ని ఆనాడు మహాత్మాగాంధీ చించివేస్తే పార్లమెంట్‌లో ఎన్నా ర్సీ పత్రాలను చించి వేసిన ఏకైక వ్యక్తి తానేనం టూ వివరించారు. 

కామారెడ్డి ప్రాంతం కొత్తేమీ కాదు...

భారతదేశంలో తాతల కాలం నుంచి నివసిస్తున్న ముస్లిం ప్రజలకు సీఏఏ ద్వారా ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయని అసదుద్దీన్‌ ఒవైసీ వెల్లడించారు. చట్టంలోని పలు అంశాలు ముస్లిం ప్రజలను మాత్రమే టార్గెట్‌ చేసేలా ఉన్నాయని చెప్పారు. ఇతర మతాల వారికి పౌరసత్వం కల్పిస్తూ కేవలం ముస్ల్లింలకు మాత్రమే నిరాకరించడం వెనుక కుట్ర దాగి ఉందని తెలిపారు. తాతల కాలం నుంచి ఈ గడ్డపైనే పుట్టి పెరిగిన వారంతా సీఏఏ చట్టంలో ఆధారాలు చూపించాల్సి వస్తుందని తెలిపారు. దేశంలో ముస్లిం, దళిత వర్గాల ప్రజలకు సగానికి ఎక్కువ మందికి పుట్టిన తేదీ ధ్రువపత్రాలే లేవని, అలాంటప్పుడు సీఏఏను ఎలా అమలు చేస్తారంటూ ఎంపీ ఒవైసీ ప్రశ్నించారు. కామారెడ్డి ప్రాంతం తనకు చిన్నప్పటి నుంచి తెలుసేనంటూ పాత జ్ఞాపకాలను ఒవైసీ నెమరవేసుకున్నారు. తన తండ్రితో కామారెడ్డి పాత బస్టాండు ప్రాంతానికి వచ్చి ఫ్రూట్‌ సలా డ్‌ ఆరగించినట్లుగా గుర్తు చేసుకున్నారు. సభలో ఎంఐఎం కౌన్సిలర్‌ అభ్యర్థులు  మహ్మద్‌ సాజద్‌, మహ్మద్‌ జుబీన్‌, ఎంఏ రహీం ఖాన్‌, డాక్టర్‌ సమద్‌, షరీఫ్‌, మహ్మద్‌ జాఫర్‌తో పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.logo