శనివారం 28 మార్చి 2020
Kamareddy - Jan 18, 2020 , 03:13:10

టార్గెట్‌ మున్సిపాలిటీ...!

 టార్గెట్‌ మున్సిపాలిటీ...!


కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురువేయడమే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. కాం గ్రెస్‌, బీజేపీ పార్టీలను చిత్తుగా ఓడించి పురపాలక పీఠాలను కైవసం చేసుకునేందుకు గట్టి ప్రయత్నా లు చేస్తున్నారు. ఆరేళ్లలో సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకు పోవడంతో పాటుగా మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు అనివార్యతను నేతలంతా ప్రజల్లోకి బలంగా తీసుకుపోతున్నారు. ప్రస్తుతం కామారెడ్డిలో ఒక్కో వా ర్డు స్థానానికి గెలుపొందే సమర్థమైన నాయకుడినే ఎంపిక చేశారు. వారి గెలుపు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులంతా సమష్టిగా వార్డుల్లో విస్తృతంగా తిరుగుతున్నారు.ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకత్వ సూచనల ప్రకారం గులా బీ సైన్యం ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నా రు. ఇక కాంగ్రెస్‌, బీజేపీలు వరుస ఎన్నికల్లో పరాజయాన్ని మూటకట్టుకోగా పుర పోరులో పరువు నిలుపుకునే ప్రయత్నం చేయబోతున్నట్లుగా అర్థం అవుతున్నది. జిల్లాలో ప్రాభవా న్ని కోల్పోయిన కాంగ్రెస్‌ పుర ఎన్నికలను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతుందంటే అతిశయోక్తి కాదు.

ఏడు వార్డుల్లో ఏకధాటిగా ప్రచారం...

ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శుక్రవారం ఏకధాటిగా ఏడు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. నా మినేషన్ల ముగింపు నాటి నుంచి స్థానికంగా గులా బీ శ్రేణులను సమన్వయం చేసిన స్థానిక ఎమ్మెల్యే గంప సంక్రాంతి పండుగ రోజు నుంచి ఉధృతంగా వార్డుల్లో కలియ తిరుగుతున్నారు. అభివృద్ధి ప్రధా న అస్త్రంగా ప్రచారం చేస్తున్నారు. ఆయా చోట్ల ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తూ మున్సిపాలిటీ గెలుపు ఆవశ్యకతను సవివరంగా వివరిస్తున్నారు. ఇప్పటి వరకూ కామారెడ్డి అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమా లు, చేసిన ఖర్చులను లెక్కలతో సహా వివరిస్తుండడంతో ప్రజలంతా హర్షధ్వానాలతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్ధతు తెలుపుతున్నారు. శుక్రవారం 7, 32, 38, 39, 40 వార్డుల్లో ఉదయం జోరుగా ప్రచారం చేసిన గంప గోవర్దన్‌ సాయంత్రం మరికొన్ని వార్డుల్లోనూ విస్తృతంగా తిరిగారు. ప్రభుత్వ విప్‌ రాకతో స్థానిక కౌన్సిలర్‌ అభ్యర్థుల్లోనూ ఉ త్సాహం రెట్టింపు అవుతున్నది. వెన్నుతట్టి అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తుండడంతో వారంతా రెట్టింపు ఆత్మ విశ్వాసంతో ప్రచారంలో అందరి కంటే మిన్నగా దూసుకుపోతున్నారు.

వీధి వీధికి వెళ్తున్న షిండే, భాస్కర్‌రెడ్డిలు...

బాన్సువాడ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చేసిన అభివృద్ధినే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకత్వం ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ప్రోటోకాల్‌ ప్రకారం స్పీకర్‌ హోదాలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం లేనందున జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పో చారం భాస్కర్‌ రెడ్డి వార్డుల్లో విస్తృతంగా  పర్యటిస్తున్నారు. రూ.100 కోట్లతో చేపట్టిన ప్రతీ అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకు పోతున్నారు. వీరి తో పాటుగా యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలోనూ జోరుగా ప్రచారం గల్లీ గల్లీలో సాగుతున్నది. బాన్సువాడ పట్టణంలో ఎమ్మెల్యే షిండే తో పాటుగా పోచారం భాస్కర్‌ రెడ్డిల పర్యటనతో ప్రతిపక్ష పార్టీలు కంగుతింటున్నాయి. ప్రచారంలో కారు వేగానికి కాంగ్రెస్‌, బీజేపీలు మిన్నకుండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోనూ నియోజకవర్గానికి చెంది న ముఖ్య నాయకులంతా కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆధ్వర్యం లో జిల్లా నాయకులంతా ఏకధాటిపైకి వచ్చి ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు.

పట్టుదలతో  అభ్యర్థులు...

మూడు మున్సిపాలిటీల్లో వార్డుల బరిలోని అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే పట్టుదల కనబరుస్తున్నారు. ఐదేండ్లకోసారి ఎన్నికలు వస్తున్నా రిజర్వేషన్ల అనుకూలతతో గతంలో పోటీకి అవకాశం లేనివారు ప్రస్తుతం అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రచారాన్ని ముమ్మరంగా చే యగా పోలింగ్‌ జరిగే ఈ నెల 22వ తేదీ వరకు పరిస్థితిని తమకు సానుకూలంగా మార్చుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. చాలా వార్డుల్లో రెబల్స్‌ బరి లో నిలవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీల బీ-ఫారం దక్కిన వారు పార్టీ చిహ్నంపై బరిలో ఉండగా.. రెబల్స్‌, స్వతంత్రులు ఈసీ కేటాయించిన గుర్తుతో ఎన్నికల బరిలో ఉ న్నారు. ఈ నెల 22న పోలింగ్‌ ఉండగా 20వ తేదీ సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉం టుంది. ప్రచారానికి మూడు రోజులే  మిగిలి ఉండడంతో స్వతంత్రుల మద్దతు కోసం కొంత మంది అభ్యర్థులు తెరచాటు బేరాలు నడుపుతున్నట్లుగా తెలుస్తున్నది. వారి సహకారం తో ఓట్లను తమవైపునకు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. లేదంటే ఓట్లు చీలిపోయి గెలుపోటములు తారుమారు అయ్యే వీలుందనే అంచనాల తో ఆందోళనకు గురవుతున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి.logo