శనివారం 28 మార్చి 2020
Kamareddy - Jan 18, 2020 , 03:12:37

ఎన్నికల విధులు అప్రమత్తంగా నిర్వర్తించాలి

ఎన్నికల విధులు అప్రమత్తంగా నిర్వర్తించాలి


కామారెడ్డి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 22న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్‌ అధికారులు (పీవో), సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు (ఏపీవో)తో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రిసైడింగ్‌ ఆధికారులు ఎలక్షన్‌ కమిషన్‌ సూచించిన ఐదు ఫార్మాట్లను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఓటింగ్‌ రోజు మొదట పోలింగ్‌ అధికారి వద్ద ఓటరు మార్క్‌డ్‌ కాపీలో వివరాలను పరిశీలించిన అనంతరం ఓటరుకు ఓటు హక్కు అవకాశం ఇవ్వాలని సూచించారు. ప్రతీ పోలింగ్‌స్టేషన్‌లో ఒక మహిళా ఉద్యోగి ఓటర్ల పరిశీలనకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ వార్డులో 800 నుంచి 1500 వరకు ఓటర్లు మాత్రమే ఉంటున్నారని, ప్రతి ఓటరునూ క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, ఏఎంసీ గోదాంలో రిసీవింగ్‌ సెంటర్‌ ఉంటుందని తెలిపారు. పీవోలు బ్యాలెట్‌ పేపర్‌ను పరిశీలించుకోవాలన్నారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వీడియోగ్రఫీ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, శిక్షకులు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
logo