బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 17, 2020 , 01:13:52

ప్రచారంలో దూకుడు..

ప్రచారంలో దూకుడు..


కామారెడ్డి/నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా టీఆర్ ప్రచారంలో జోరు పెం చింది. నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో రెండు రోజులుగా అభ్యర్థులు జనంలోకి వెళ్తున్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలను, వృద్ధులను, చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ప్రచారంలో భాగంగా  టీస్టాల్ వెళ్లి టీ పోస్తూ హోటల్ నిర్వాహకులకు ఓటు వేయాలని కోరారు. అనంతరం వార్డుల్లో ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలను వివరించారు. 

పార్టీలో పలువురి చేరిక..

41వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ జమీల్ అహ్మద్ గంప గోవర్ధన్ సమక్షంలో టీఆర్ చేరారు. ఆయనతో పాటు మరో 25 మంది కాం గ్రెస్ నాయకులు పార్టీలో చేరగా కండువాలు కపి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వెంట ఆయా వార్డుల ఆభ్యర్థులు రాజమణి, సయ్యద్ మసూద్, జావేద్ మహ్మద్, టీఆర్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ సంక్షేమం...

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మద్ధతు పలకాలని, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో టీఆర్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇవ్వాలని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డిలోని పలు వీధుల్లో బైక్ తిరుగుతూ అందరినీ పలుకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో ఆయన పలు వార్డుల్లో ప్రసంగించారు. ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామ ని, వాటిని పట్టణ ప్రజలు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి చైర్మన్ పీఠం గెలిచి టీఆర్ జెండా ఎగురువేయాలని ఆయన అన్నారు. 10వ వార్డులో స్వతంత్రులుగా పోటీ చేస్తున్న ఉప్పట రామకృష్ణ, సుభాషప్పలను ఆయన పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు.  ఆయన వెంట స్థానిక టీఆర్ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. logo